పుట:Dvipada-basavapuraanamu.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

181

నొండెడ ధనములే దొనక బిజ్జలుని
బండారమిలు బసవ! ర " మ్మనినఁ 540
బ్రత్యుత్తరం బీనిబాస గావునను
నత్యనుచిత మన 'కట్లకా' కనుచుఁ
గన్నదబ్రహ్మయ్య గారిఁ దోడ్కొనుచుఁ
గన్నంపుము ట్లెల్లఁ గరమర్థిఁ గొనుచు
[1]నునుపరియునుబోలె నోడక నగరు
చనఁజొచ్చి బండారుసదనంబుఁ జూప
గడియకన్నం బిడఁగాఁ బదడెల్లఁ
గడసన్న పసిఁడి యై పుడమి వెలుఁగఁ
జొచ్చి పెట్టెలలోనిసొమ్మెల్లఁ గొనుచు
విచ్చేసె బ్రహ్మయ్య : యచ్చెరువంద 550
సంగరక్షకులెల్ల నరిగి యట్లున్న
భంగిన యవ్వార్తఁ బతి కెఱిఁగింప
'బసవడు నాబారిఁ బాఱెఁ బొ' మ్మనుచుఁ
గసిమసంగుచు మహోగ్రమున రేఁగుచును
నవుళులు గీఁటుచు “నక్కటా! నన్ను
శివభక్తుఁ డని విశ్వసించుటయెల్ల
వఱితిపాలుగఁ జేసెఁ; జిఱుతవాఁ డనక
యఱలేక మన్నించునంతయుఁ గంటిఁ ;
బట్టపగలు గన్న పెట్టించె బసవఁ
డెట్టోకో ప్రాణంబుఁ బట్టియున్నాఁడు ; 560
అడిగిన వలసినంతర్థ మీనెట్టు ?
లడరఁగ విశ్వాసి యయ్యె ; నిట్లింత
కెత్తికొన్నాఁ ; డింక నిటమీఁద నెంత
కెత్తికో నున్నాఁడొ యెఱుఁగరా" దనుచుఁ
గన్నులమంటలు గ్రమ్మ నేతెంచి
కన్నంబువాకిటికనకంబుఁ జూచి

  1. సహాయుఁడు.