పుట:Dvipada-basavapuraanamu.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

బసవపురాణము

మంతరకాటుక మఱి చండవేది 510
సెలగోల యొంటట్టచెప్పులుఁ బీఁకె
యొలుకుల బూడిదయును వాటుఱాలుఁ
గుక్కలవాకట్టుఁ గొంకినారసము
గ్రక్కునఁ గంకటిరజ్జువు నమర
సూచీముఖం బైనఁ జొనుపంగ రాని
యేచినచీకటి నిండ్లపంచలకుఁ
జిడిముడిపలుకులఁ జేరి యుల్వరసి
గడియకన్నంబును గడపకన్నంబు
గోడకన్నంబును గుఱినేలకన్న
మోడక త్రవ్వి యిల్లొయ్యనఁ జొచ్చి 520
పరికించుచో భక్త భవనంబు లైన
సరసర దీపంబు సంధించి వారి
పాదాబ్జములమీఁదఁ బడి మేలుకొలిపి
పాదోదకంబు ప్రసాదంబుఁ గొనుచు
"శరణనియెడి సత్యశరణులయింట్ల
వరువుఁడ బ్రహ్మఁ డన్వాఁడ నే" ననుచు
నెడనెడ నేఁగుచు నితరు లిండైనఁ
దడయక పదపదార్థంబులు దేవి
కొనివచ్చి జంగమకోటికి వరువుఁ
బను లాచరించు చిప్పాట వర్తింప- 530
జంగమ మొకనాఁడు చాల నేతేర
భంగిగా నిది పట్టపగ లని యనక
“నేలకన్నంబిడి నిఖిలేశునగరఁ
జాలనర్థముఁ దెత్తుఁ జక్కన" ననుచు
నరుగుచో బసవఁడు పురవీథిఁ గాంచి
యరుదొంద భువిని సాష్టాంగుఁ డై ంమ్రొక్కఁ
“బట్టుము గత్తియు బలపంబుఁ గన్న
పెట్టఁ బోవలయు నా కిట్టున్న భంగి