పుట:Dvipada-basavapuraanamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

104

బసవపురాణము

డలరుచుఁ దపసి యై యరుదెంచి తన్ను
జవుకమం దునిచి నొసల భూతి పెట్టి
శివతీర్థకలశాభిషిక్తుఁ గావించి, 740
“చనఁజన ముందట ఘనలింగమూర్తిఁ
గనియెదు: ప్రాణలింగంబు నీ కదియు”
నని యుపదేశించినట్లు స్వప్నమునఁ
గని, మేలుకాంచి నల్గడలు వీక్షింప
మును లేనిదొక ద్రోవ ముందట నున్నఁ
“బొనర [1] నిక్కల యయ్యెఁబో కల' యనుచు
దనతోడి యెఱుకుల నునిచి యొక్కండ
చనఁ జన ముందట ఘనలింగమూర్తి
యున్న సంతోషించి కన్నప్ప దేవుఁ
డున్నత భక్తి సంయుక్తుఁ డై మ్రొక్కి 750
“కలగన్న చోటికి గంపఁ గొంపోవ
ఫలసిద్ధి యగుటెల్ల భాగ్యంబు గాదె ?
మును దపోమూర్తి సెప్పిన లింగ మిదియ
తనప్రాణనాథుఁ డౌ" నని నిశ్చయించి,
“బాస గా దింక నీప్రాణలింగంబుఁ
బాసి పోఁ దగదు మా పల్లియ ; కితని
గ్రక్కునఁ గొనిపోయి కట్టుదుఁ బాక ;
నిక్కడ నునుపరా దెండఁ గాలంగ ;
బుద్ధులు సెప్పియు బుజ్జగించియును
దద్దయుఁ గీడ్పడఁ దగ[2] వెడ్డు వెట్టి 760
వలసిన వస్తువు లిలఁ దెచ్చి యిచ్చి
వలపించి కొనిపోవ వలె" నని తలఁచి
పరమహర్షమున విస్ఫారాంగుఁ డగుచు
వరముగ్ధభావన హరున కి ట్లనియె :
“అక్కటా ! యిది యేమి హరుఁడ యొక్కరుఁడ

  1. వెంటనే యనుభవమునకు వచ్చు కల.
  2. ఆశపెట్టి, వంచించి.