పుట:Dvipada-basavapuraanamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

105

నిక్కడ నుండుట యేమి గారణమొ !
తల సూప కేయూరి తమ్మళ్ళ తోడ
నలిగి వచ్చితి సెప్పు మలుక దీర్చెదను ;
[1]గొరగ లుమ్మెత్తపత్తిరిఁ బూజసేయ
మరులెత్తి వచ్చితో యురుతరాటవికి : 770
పరసలత్రొక్కునఁ బడ జాల కీవు
సిరిగిరి నుండక సురిఁగి వచ్చితివొ ?
జటలకు నొడలికి సవతులు వోర
నుడుపఁ జాలక వచ్చి యడవిఁ జొచ్చితివొ ?
చెన్నయ్య గలసినఁ జెడెఁ గులం బనుచు
నిన్ను లోకులు వెలి యన్న వచ్చితివొ ?
పలుమాఱు నంబికిఁ బడిపను ల్సేయ
సొలసి వచ్చితివొ యిచ్చోట డాఁగంగ ?
నాఁటి బ్రహ్మము నేఁడు నాయంబు దప్ప
వేఁటాడ వచ్చితో ? వేయును నేల 780
నాతోడి మోహంబునన నన్నుఁ బ్రోవ
నేతెంచితో వేడ్క యెసఁగ నిచ్చటికి !
నెట యుండి వేంచేసి తెట్లు ? నీబ్రదుకు ?
ఇట యుండఁ జొచ్చి తీ వెంతగాలంబు ?
ఎక్కుడుగోద ని న్నిక్కడ వైచి
యెక్కడ వోయె నే నేఁగెదఁ జెపుమ ?
ఒడల నర్థము గొన్న యుమబోటి యెద్ది ?
యెడ కైన నవ్వరే యెక్కడివారు ?
కట్టిన గోచి యెక్కడ నొల్వువడితి ?
వట్టేల వచ్చితి వడవి కొక్కఁడవ ? 790
చంక బొక్కసమును సడలియున్నదియు
శంకింప కొం టెట్టు సరియించెదయ్య !
కొండలలోన నొక్కండ వీ విట్టు

  1. భక్తులు.