పుట:Dvipada-basavapuraanamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

95

ముక్కంటి! నా కింక ది క్కెవ్వరయ్య ?
నాకొఱకైనఁ బినాకి ! యివ్విషము
చేకొన కుమియవే నీకు మ్రొక్కెదను :
గటకటా ! మేన సగంబున నుండి
యెట వోయితవ్వ: నీ వెఱుఁగవే గౌరి !
ప్రమథగణములార ! పరమాప్తులార !
సమసిన వెండి మీశక్యమే కావ ?
శతరుద్రులార : యసంఖ్యాతులార!
క్షితిధరకన్యకాపతిఁ గావరయ్య ! 490
వీరభద్రయ్యరో : విషముఁ బాణేశుఁ
డారగించె నిఁ కెట్టు లవునో కదయ్య !
యోపురాతనులార ! యొడయుండు బ్రదుక
నోపు నొకో ! విషం బొగి నారగించెఁ ;
జావు దప్పింపరే సద్గురునాథు ;
దీవన లీయరే కావరే శివునిఁ ;
దల్లిలేని ప్రజలఁ దలఁతురే యొరులు ?
తల్లి యున్న విషముఁ ద్రావ నేలిచ్చు !
పరమేశుఁ డీబారి బ్రదికెనేనియును
మరణంబు లేదువో మఱి యెన్నఁటికిని." 500
నని ప్రలాపింపుచుఁ బనవుచు నొండు
వినఁజాలఁ బ్రాణము ల్విడుతు నే ననుచుఁ
దడయక ఘనజలాంతరమున నుఱుకఁ.
బడకుండ నారుద్రపశుపతిఁ బట్టి
పార్వతీసహితుఁడై ప్రమథరుద్రాది
సర్వసురాసురసంఘంబు గొలువ
హరుఁడు ప్రత్యక్ష మై “యడుగుము నీకు
వర మిత్తు నెయ్యది వాంఛితం" బనుడుఁ -
గడుసంభ్రమంబున మృడుపదాబ్జములఁ
బడి రుద్రపశుపతి భట్టారకుండు 510