పుట:Dvipada-basavapuraanamu.pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

బసవపురాణము

లంగన పరిచర్య లాచరింపంగ
లింగావసరము సెల్లించునంతటను...
నొగిమనోహరుని పాదోదక సేవ
నగణితలీల దివ్యాంగుండ నైతి
నఖిలమాహేశ సమగ్ర ప్రసాద
సుఖ సేవ నా కింకఁ జొప్పడునేని 400
నిలుకాల నిలువంగ నేరక తిరుగు
నలమట వాయుఁ బొమ్మని తలపోసి
వచ్చినమాడ్కి దివాకరుం డంతఁ
జెచ్చెర నుదయాద్రిశిఖర మెక్కుడును.
బసవనియాత్మ కిం పెసఁగ మిండండు
వెస నేఁగుదెంచి తా వెండి యి ట్లనియె :
“బసవ ! యే మని చెప్ప భర్గుఁడే యెఱుఁగు
నెసఁగ లంజెఱిక మే నీరాత్రిసేఁత ;
నీవును మాతోడ రావై తి గాని
వేపునంతకు నొక్కవిధమైనసుఖము ; 410
ఐనను లంజెర్క మచ్చోటఁ జేయు
చో నిన్నుఁ దలఁచితిఁ జుమ్మయ్య బసవ !
పుట్టితిఁగాని ము న్నిట్టి సుఖంబు
నిట్టిలంజెఱికంబు నెఱుఁగ నెన్నఁడును :
మలహరుకృపలేని మత్తికాండ్రకును
గలుగునే లంజెఱికం బిట్లు సేయఁ ?
బగలు రాత్రియు నెడఁబడక లంజెఱిక
మొగి నెన్నియుగము లి ట్లొప్పుగఁ జేసి
పడసితి చెప్పుమా బరమేశుచేతఁ
గడునొప్పు లింగజంగమసంపదలను ; 420
సడిసన్న శివభక్తి సౌభాగ్యమహిమ
లొడఁగూడునే వెండి యొండుమార్గమున ?
నాకును నీకారణమునఁ గాఁజేసి