పుట:Dvipada-basavapuraanamu.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

91

—: చంద్రోదయ వర్ణనము :—


“మలసంహరుఁడు జటామకుటంబుమీఁద
నిలిపియు నాకందు నెఱిఁ బుచ్చ లేఁడు
భక్తులపాదసంస్పర్శనంబునను
వ్యక్తిగా నిర్మలత్వంబుఁ బొనదుదును” 370
అని యాత్మఁ దలపోసి యరుదెంచుమాడ్కి
వనజారిప్రాఙ్ముఖంబున నుదయించె.
బసవనిసితకీర్తి వర్వెనా, శివుని
భసితాంగరాగప్రభలు వర్వె నాఁగ,
నారద్రునట్టహాసాంశులు దనరె
నా. రజతాచలచారుదీధితులు
విలసిల్లెనా , నభోవీథి నెల్లెడల
నెలకొని యచ్చవెన్నెల వెల్లివిరియ-
నక్కాంత ముగ్ధసంగయ్యకుఁ బ్రీతి
నెక్కొని యాత్మలో నివ్వటిలంగ 380
ననయంబు లింగపూజనల నటించు
తనదువిలాసినీజనుల రావించి, *
“తాళము ల్వట్టుఁడు దాళగింపుండు
నాళతివేళకు నందఱు" : ననుచు
నవిరళంబుగ నంత నార్భటం బిచ్చి
జవనిక రప్పించి సరసమై నిలిచి.
పొలుపగుముఖరసంబును సౌష్ఠవమ్ము
లలియు భావంబు ధూకళియు ఝంకళియు
మఱియు ఠేవయు విభ్రమమును రేఖయును
నెఱయుగ నీరీతి నృత్యంబు సలుప 390
లింగార్చనంబు సల్లీలఁ జేయుచును
మంగళారవములు సంగడి నులియ
వెల్లవేగుడు-స్వచిత్తోల్లాస మమర
సల్లీల నమ్ముగ్ధసంగయ్య కిట్టు