పుట:Dvipada-basavapuraanamu.pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

బసవపురాణము

సారసద్గుణవర్తి శాశ్వతమూర్తిఁ
గని, పాదచారి యై చనుదెంచి, చేరి,
ఘనతరప్రియపూర్వకంబుగ నపుడు
సముచితసత్కారసంతుష్టుఁ జేసి,
సమదాంధగంధగజంబు లేళ్నూఱు
పండ్రెండువేలు శుంభత్తురంగములు
పండ్రెండులక్షలు బలవత్పదాతి
పాటి బండారులు పన్నిద్ద ఱందు,
మేటితనంబు నర్మిలి నిచ్చి, తనదు 90
నఖిల రాజ్యమునకు నర్హుఁగాఁ జేసి,
సుఖలీల బిజ్జలక్షోణీశ్వరుండు
దానును బసవదండనాయకుఁడు
నా నియోగము గొల్వ నరుదెంచుచుండ_[1]
జగతీతలేశుండు నగరోపకంఠ
మగుడు నాబసవయ్య నర్థిఁ దోడ్కొనుచుఁ
బరిమితభటమంత్రిపరివృతుం డగుచు
నరుదెంచి భవనాశ్ర యాభ్యంతరమున
మున్నున్నమంత్రులు పన్నిద్దఱకును
[2]గన్నాకుగాఁ బెద్దగద్దియ నునిచి. 100
వరవస్త్ర భూషణోత్కరము లర్పించి,
యరుదొంద బసవయ్య కాతఁ డిట్లనియె :
“సకలసామ్రాజ్యపూజ్యస్థితి కెల్లఁ
బ్రకటింపఁగా నీవ పతి, వట్లుఁ గాక
నాయర్థమునకుఁ బ్రాణమునకుఁ బతివి ;
వేయును నేల ? నీవే నేను బసవ !
నిన్ను నమ్మితి" నంచు నెయ్య మెలర్ప
మన్నన బిజ్జలక్ష్మాధీశుఁ డనిన-

  1. ఇట్టి గుర్తులు పెట్టినచోట గ్రంథసంక్షేపణార్థము కొన్నిద్విపదలు వదలఁబడినవని
    తెలియనగును.
  2. మిన్నగా.