పుట:Dvipada-basavapuraanamu.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాశ్వాసము

49

శ్రీరమ్యముగ నలంకారింపఁ బంచి,
భూరమణుండు శృంగారంబు సేసి,
మండలాధీశ సామంత ప్రధాన
దండాధినాథమాతంగతురంగ
పరివారసహితుఁ డై పరమహర్షమున
నరుదెంచి పదహతి ధరణి గ్రక్కదల
వివిధవాద్యధ్వనుల్ దివి దీటుకొనఁగ
నవనీతలేశుఁ డల్లంతటఁ గాంచె 60
బసవకుమారు; సద్భక్తిశృంగారు
నసదృశాకారుఁ దత్త్వార్థవిచారు
నేకాంగవీరు దేహేంద్రియదూరు
లోకనిస్తారు నలోకానుసారు
జంగమవ్యాపారు సజ్జనాధారు
లింగగంభీరు గతాంగవికారు
విమలశివాచారుఁ ద్రిమలధిక్కారు
నమితమహాచారు నచలితిధీరు
విరహితసంసారు వీరావతారుఁ
బరిహృతాహంకారు భక్తివిహారు 70
శివభక్తిసారు విశిష్టప్రకారు
నవినాశసంస్కారు నతులితశూరు
విపులక్షమాగారు వినయప్రచారు
నుపథైకవిస్తారు శుద్ధశరీరుఁ
గుజనవిదారు సద్గుణమణిహారు
వృజినతరుకుఠారు విహితోపకారు
నతిదయలంకారు నఘసముత్సారు
హితహృద్గతోంకారు నతసముద్ధారు
శ్రుతిపరిచారు నిర్మోహాంధకారుఁ
గృతరిపుసంహారు ధృతనయాచారుఁ 80
జారునిర్మలకీర్తి సత్యప్రపూర్తి