Jump to content

పుట:Dvipada-Bagavathamu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మధురకాండము

29

ప్రభాసతీర్థమందు మునిఁగి చనిపోయిన కుమారుని తెచ్చిపెట్టుమని శ్రీకృష్ణుని గర్గ్యుఁడు కోరుట


“తనర ప్రభాసతీర్థములోనఁ దొల్లి
మునిగిపోయినపుత్రు మొగిఁ దెచ్చియిమ్ము
[1]డిది దుష్కరపుకార్య మిటు సేయుఁ” డనిన
యగుఁగాక యని ప్రీతి హాలియును దాను
నగణితాయుధపూర్ణమగురథం బెక్కి

శ్రీకృష్ణుని సముద్రుఁడు పూజించి వచ్చినపనిఁ దెలియఁజెప్పుమనుట


చను దేర; నెదురేఁగి జలరాశి మ్రొక్కి
యనుపమదివ్యరత్నాళిఁ బూజించి
“తామరసాక్ష! మాధవ! లోకవంద్య!
ఏమి విచ్చేసితి రెఱిఁగింపు” మనుఁడు;
“తొడరి మాగురువుపుత్రుని మ్రింగినాఁడ
వుడుకకఁ దెచ్చి మా కొప్పించు” మనిన;
“నా కేమి పని యిది? నాలోన నుండి
భీకరాకారుండు పృథుకంపురూపుఁ310
డగురాక్షసుఁడు మ్రింగె” నని చెప్ప శౌరి
యగణితశక్తిని యంబోధి నుఱికి
వేదచోరునిఁ దొల్లి విదళించుభంగి
నాదుష్టదనుజుని యడగించి వాని
కడుపులోనున్న శంఖము పుచ్చుకొనుచు
తడయక వెడలి రథంబెక్కి కదలి

  1. “డిది మాయభీష్టమిది దుష్కరపుకార్యమిటు శేయుండనిన” అని పాఠము, దీనిని
    రెండుపాదములుగా విభజింప వీలులేనందున పైవిధముగా సరిదిద్ది యొకపాదము
    మాత్ర మివ్వబడినది.