పుట:Domada-Yuddhamu.Somaraju-Ramanujaraopdf.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

4


చదువరులారా! నేనేమో యింతవఱకు వ్రాసితినని తలంచకుఁడు. భారతమాతకు ముఖ్యాలంకారభూత లైన యిట్టి సత్కులపనూతలను గుఱించి యిట్టి వీరవనితా శిఖామణుల గుణించి పుట్టినింటికి మెట్టినింటికేగాక దేశమునకుఁగూడఁ గీర్తిఁ దెచ్చిన దివ్యచారిత్రిణుల గుఱించి యెంత ముచ్చటించినను వానినను తనివిదీరదుగదా! ఇటి వీరమాతలే పాశ్చాత్యౌదిదేశములం దుద్భవించిన, దేశమునకై ప్రాణంబులర్పించిన యే సుస్క్రీస్తువలె యేదివ్యమంగళ విగ్రహంబుగనో ముక్తినొసంగు యేదేవతాస్వరూపిణిని లెనో చిత్రఫలకంబులుగా నిర్మించి యింటింట నలంకరించి గ్రంథస్థంబులఁ గావించి పూజింపకుందురా? ఇట్టి మానినీమణుల దివ్య చరితాదులఁ గోలుటం జేసి యాత్మ గౌరవాదిదివ్యశక్తు లా వేశించి దేశంబు దాస్య పాపవిముక్తులం బడసి సౌఖ్య సంపదనంది కృతార్థతఁ గాంచునని గ్రహించెదరు గాక. ఇట్లే శ్రీ గాను, చెలికాని వంశద్వయంబునకు సర్వదా అన్యోన్యమైత్రిని వెలయించుచు, వైరిహరణం బొనర్పఁజేయుచు భగవంతుఁడాయురారోగ్యైశ్వర్యాభివృద్దు లొసంగి రక్షించుఁగాక యని గోరుచు విరమించుచున్న వాఁడ.

దుమ్ముగూడెము, భద్రాచలము తాలూకా.

ఇట్లు, సోమరాజు రామానుజరావు.