పుట:Domada-Yuddhamu.Somaraju-Ramanujaraopdf.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3

అసహోదరవిరాజమానుఁడును, ప్రచుకతరపరాకమ క్రమకుమార మార సుకుమార కుమార మండలీ ఖానుండును, నాత్మీయభౌగినేయామేయ రేచర్లగోతోపథిస్ఫార పారావార తారాధినాధ విద్వన్మణి స్తోత్ర పాత్ర చారిత్ర సనాధకుమార మహీపతిరాయగోత్రా కళత్రిపుత్ర విశాల దిశా కాండ హిండమాసాఖండ డిండీర పుండరీ కాఖండల వేదండ కోదండ శోభామండన యశోమండలోద్దుడ చండప్రతాపాటోపవిధాన ముధాకృత సుధాకర సూగ్య సూర్యరాయ విశ్వంభరావర వరిష్ఠ గరిష్ఠతర సంగీత సంగీత సాహిత్య సాహిత్యక విత్వత త్వవిజ్ఞాన పజ్ఞాన వడ్య వైశారద్యా శేషాంధ్ర యవన హూణాది భాషావి శేషవిక స్వరవినిర్మలాగణిత సుగుణమణిగణధర్మ ధర్మరాయ నరవరా సర సతత సంలబ్ధ సమధి కసత్కార సహితుండును, సకల సుక విజనవతంస సహితుండును, సర్వ సర్వంసహాభాగ భాగక్షీణ లక్ష్మీకటాక్ష వీక్షణపాత్ర పద్మనాయక గోత్ర విఖ్యాత సమాఖ్యా సముజ్జ్వల చెలికానికుల నలినీవనీలోక బాంధవుండును, సమస్త సామంతరాజన్యమూర్ధన్య ముఖ్య బొం ధవుండును, నిరంతర ప్ర్రాచుర్య పైర్యగుణమణీతృణీకృత మందరుండగు శ్రీమద్వేంకటరాయ వసుంధరా పురందరుం డోకానొక సమయంబున అని జమీందారుఁడుగను ప్రభుసమానునిగను పేర్కొనినారు.

ఇంక జగ్గమాంబ నీలాది రాయని భార్య యైనట్లు పీఠికాపుర సంస్థాన చరిత్రయందు “నీలాద్రి రాయఁడును బొబ్బిలియుద్ధమునందు వీరస్వర్గము నలంకరించిన రంగారావును తోడియల్లురు.” అని చెప్పఁబడుచుండుటయు, మఱియు మల్లమ్మా దేవి మరణించినపుడు నా మెబిడ్డను సంరక్షించుటకు జగ్గమాంబకడకు బంపుటంబట్టియు, అప్పుడు నీలాద్రిరాయఁడు పిఠాపురపురాజు గా, నుండుటంబట్టియు వీరిరువురు నప్ప చెల్లెండ్రు యైయుండినట్లు స్థిగపడుచుండె. నీలాద్రిరాజు కాలధర్మమందినప్పు డాయనతో ఁగూడ శ్రీజగ్గమాంబ మరణించెనని చెప్పుదురు. నీలాద్రి రాజు యీ పతివతాతలకంబు పేర భీమవరసమీపంబున నొక పేట కట్టించియుండిరి. అది యిప్పటికిని సుప్రసిద్ధంబుగ నామెపేరున వెలసియున్నది. ఈ నారీమణులు యీ పతివ తాతిలకంబు లిరువుకు బంగరుకు వన్నె తెచ్చినటుల తమభర్తలకుఁ గీర్తి తెచ్చుటయేగాక పద్మనాయక వంశంబునకును భారతభూమికిని యాచంద్రార్క మైన కీర్తిని గడించి పరమపదవి వేగిరి. ఈపవిత్రపతివ్రతా చారిత్ర మణుల కాకరంబగు చెలికానివంశంబు పరమపవిత్రం బై దనరుచున్నయది. ఆనాఁటి పట్టభద్రులే గాక యిప్పటి బొబ్బిలి వేంకటగిరి సంస్థానాది ప్రభువులు కూడ వీరి యింట యాడుబిడ్డలను యుద్వాహంబై సత్సంతానాద్యైశ్వర్యాభివృద్ధులం గాంచుచు విఖ్యారియశస్కులై సౌఖ్య సంపదలఁ గాంచుచున్నారు.