పుట:Domada-Yuddhamu.Somaraju-Ramanujaraopdf.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉపక్రమణిక.

I.

ఆంధ్రదేశ చరిత్రంబున అత్యంతప్రశస్తి వహించిన బొబ్బిలిమహాసంగ్రాము మిట్టే గడచిపోయెను. కొంతకాలము శాంతభావము దృశ్యంబయ్యె. బొబ్బిలియుద్ధంబున ఆంధ్రలక్ష్మి చండగంభీరస్వరూపమును ధరించి విజృంభించె, వీరాధివీరులగు నామె పుత్రు లనేకులు రణశయనం బలంకరించిరి. వారి పవిత్రాత్మలు వీరస్వర్గంబున కేగినవి. రంగరాయఁడు వెంగళరాయఁడు శార్దూలభయంకరాకారుఁడగు తాండ్ర పాపయ్య నల్సారాయఁడు ధర్మారాయడు వెంకయ్య అను ప్రచండ నామంబులు, వీరాగ్రేశు లగు భారతిపుత్రులకు చిరస్మరణీయంబు లయ్యె. ఈ గడచిన కొన్నాళ్లకు ఆంధ్రదేశంబున బ్రచండంబగు మఱియొక యుద్ధంబు పద్మ నాయకులమధ్య దోమాడయను గ్రామంబున సంభవించె. ఇద్దానిని గుఱించియే యీంథంబున పేర్కొనఁబడియుండె.

II.

ఈ యుభయ యుద్ధంబులందుఁ గల ప్రభువులకు ప్రభ్విణులకుం గల సంబంధ బాంధవ్యంబుల గుఱించియు, యీవీరవనితలు దేశమునకు దెచ్చిన కీర్తినిబట్టియు, పవిత్ర జన్మస్థానాదిక ప్రాశస్త్యంబుల గుఱించియుఁ గొంత విమర్శనాపూర్వకంబుగా ముచ్చటించి విరమించ నిచ్చగించితిని. ఈ నారీమణు లిరువురు నప్ప చెల్లెండ్రును చెలికానివారి యాడుబిడ్డలు నై యుండిరి. ఈ చెలికానివారు పూర్వమునుండియు నేటివఱకు మూర్ధాభిషిక్తులగు సంస్థానాధిపతులతోడ సంబంధ బాంధవ్యంబులు నెఱపుచు (చెలికానివారికిని చిన్న చిన్న జమీలు గలవు.) ప్రభుసమానులై పద్మనాయకులం దగ్రగణ్యులై బరగుచుండిరి. కశింకోటసంస్థాన మొకప్పుడు చెలికానివారిదై యున్నట్లు వాడుకయై యున్నిది. కారణాంతరములవల్ల బ్రాహ్మణాధీనమైనట్లు తెలియుచున్నది. యుద్ధమందున్న చెలికాని వెంకయ్య జమీందారుఁడు గాను రంగారావుగారి మామగారైనట్టును మల్లమ్మాదేవి వీరింటి బిడ్డయైనట్లుకు రంగారాయచరితయందు -

"సీ| తనతమ్ము నవనిభృ ♦ ద్ధైర్యు మహాశౌర్యు వెంగళరాయ భూ ♦ విభుని నొకనిఁ దనదుమామ నమేయ ♦ దర్ప డర్పాధీశు చెలికాని వెంకయ ♦ క్షిధిపు నొకనిఁ దనబాంధవుని రిపూ ♦ త్కరవనీఘోరదవాగ్ని దామర్ల ♦ దమ్మన్న నొకని"

యనియు, మఱియం,

మ" "లలితాటోపభూషణంబగు రణోలా సెక సంజాత ని