విశే: తిరునాంగూర్ తిరుపతులలో ఒకటి.
మార్గము: మణిమాడక్కోయిల్‌కు చేరువలోనే గలదు.
పా. తిరుమడన్దై మణ్ మడన్దై యిరుపాలుమ్ తిగழ
త్తీవినైగళ్ పోయగల వడియవర్ గట్కెన్ఱుమ్
అరుళ్‌నడన్దు; ఇవ్వేழுలగత్తవర్ పణియవానీర్
అమర్‌న్దేత్త విరున్ద విడమ్ పెరుమ్ పుగழ் వేదియర్‌వాழி
తరుమిడజ్గళ్; మழర్‌గళ్ మిగుకైతై గళ్ శెయ్గనీర్
తామరైగళ్ తడజ్గొడరుమిడజ్గ డొఱువ్ తిగழ
అరువిడజ్గళ్ పొழிల్ తழுవి ఎழிల్ తిగழு నాజ్గూర్
అరిమేయ విణ్ణగరుం వణజ్గు మడనెంజే
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 3-10-1
33. తిరుత్తేవనార్‌తొగై 33 (కీళ్‌చాలై)
శ్లో. తేవనార్ తొగై సునామ్ని పట్టణే శోభనాఖ్య నళినీ సమన్వితే|
శోభనాహ్వయ విమాన మధ్యగ: పశ్చిమాననయుత స్థ్సితిప్రియ:||
శ్లో. దేవనాయక విభు:కడల్ మకళ్ నాయకీ వపుషి మగ్నలోచన:|
సేవితో వర వసిష్ఠ యోగినా రాజతే కలిహ సంస్తుత స్సదా||
వివ: తెయ్‌వనాయకన్-కడల్ మకళ్ తాయార్-శోభన పుష్కరిణి-శోభన విమానము-పశ్చిమ ముఖము-నిలచున్న సేవ-వసిష్ఠునకు ప్రత్యక్షము-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది. దేవతలు గుమిగూడి పెరుమాళ్ళను వేంచేపు చేసిన స్థలము గాన తిరుతేవనార్ తుగై యనిపేరు వచ్చినది.
విశే: తిరువెళ్లక్కుళము, తిరుక్కావళంబాడి సన్నిధి అర్చకులే ఈ సన్నిధి కైంకర్యమును కూడా చేయుచున్నారు. కావున వారిని ముందుగా కలసికొని సేవింపవలసియున్నది.
మార్గము: తిరునాంగూర్‌కు 1 కి.మీ దూరములో ఉన్నది. ఈ క్షేత్రమునకు 1 కి.మీ దూరములో అణ్ణన్ కోయిల్ కలదు.
పా. ఇలమెల్లా మముదుశెయ్‌దు నాన్మఱైయుమ్ తొడరాద,
పాలగనా యాలిలైయిల్ పళ్లికొళ్లుమ్ పరమ నిడమ్,
శాలివళమ్ పెరుగివరుమ్ తడమణ్ణి త్తెన్ కరైమేల్,
శేలుగళుమ్ వయల్ నాజ్గై త్తిరుత్తేవనార్ తొగైయే.
తిరుమంగై ఆళ్వార్-పెరియ తిరుమొழி 4-1-6
44