Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26. తిరుక్కణ్ణంగుడి - 26

(కృష్ణారణ్య క్షేత్రం)

శ్లో|| శ్రీ మచ్చ్రవణ కాసారే తిరుక్కణ్ణంగుడీరితే
    పురే శ్యామళ తంవాఖ్యః అరవ్ందలతాయుతః
    ఉత్పలాఖ్య విమానస్థః ప్రాజ్ముఖో గౌతమర్షిణా
    ప్రత్యక్షితః కలిఘ్నార్య సంస్తుతో భువి భాసతే

వివ: శ్యామలమేని పెరుమాళ్ - అరవిన్దవల్లి తాయార్ - శ్రవణ పుష్కరిణి - ఉత్పల విమానము - తూర్పుముఖము - నిలుచున్న సేవ - గౌతమ మహర్షికి (భృగు, బైద్యులకు) ప్రత్యక్షం - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రమునకు కృష్ణారణ్య క్షేత్రమని పేరు కలదు. ఇచట ఆకులు ముడుచుకొనని చింతచెట్టు (ఉఱంగాప్పుళి) తిరుమంగై ఆళ్వార్ రాయి విసరిన చోట ఏర్పడిన ఊరా కిణర్ అను మంచి నీటి చెఱువును ఉండెడివి. పుష్పించియు కాయలు కాయని పొగడ చెట్టు కలదు.

ఇచ్చట తాయార్ మూలవర్ ఉత్సవర్ ఒకే పోలికలో నుండుట విశేషము. తిరుమంగై ఆళ్వార్ బంగారు బుద్ధ విగ్రహమును దాచిన స్థలము. ఆ స్థల యజమానితో వచ్చిన వివాద కారణముగా "తీరావழక్కు తిరుక్కణ్ణం గుడి" (తీరని వాజ్యము తిరుక్కణ్ణంగుడి) యని ప్రసిద్ధి చెందినది. కుంభమాసం మఖా నక్షత్రం తీర్థోత్సవము జరుగును.

మార్గము: నాగపట్నం - శిక్కిల్ - కీవళూర్ మధ్యన గల ఆళయూర్ అను చోట బస్ దిగి 1 కి.మీ. నడచి సన్నిధి చేరవచ్చును. తంజావూరు - కీవళూర్ మార్గములో కీవళూర్ నుండి 3 కి.మీ. వసతులు స్వల్పము.

పా|| వజ్గమామున్నీర్ వరినిఱ్ప్పెరియవాళ రవినణైమేవి
    తజ్గమార జ్గైత్తడ మలరున్ది చ్చామమామేని యెన్ఱలైవన్
    అజ్గమా ఱైన్దు వేళ్వి నాల్‌వేద మరుజ్గవై పయిన్ఱు; ఎఱిమూన్ఱుమ్‌
    శెజ్గయాల్ వళర్కున్దుళక్కమిల్ మనత్తోర్ తిరుక్కణ్ణజ్గయ్ళ్ నిన్ఱానే.
    వెన్ఱిశేర్ తిణ్మై విలజ్గల్ మామేని వెళ్ళెయిట్రారిత్తఱుకణ్,
    పన్ఱియాయన్ఱు పార్ మగళ్ పయిలై తీర్తవన్ వజ్జవర్ పొగన్
    ఒన్ఱలావురువత్తులప్పిల్ పల్ కాలత్తయర్ కొడి యొళివళర్ మదియుమ్‌
    శెన్ఱుశేర్ శెన్నిచ్చిగరనన్ మాడ త్తిరుక్కణ్ణజ్గుడియుళ్ నిన్ఱానే.
                తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 9-1-1.4.