మఱియు ఈ క్షేత్ర స్వామి విషయముగా "తిరువెழுక్కూత్తిరుక్కై యను ప్రబంధమును అనుగ్రహించిరి. నాధమునులకు ముందుగా లభ్యమైనది "ఆరావముదే" యను దశకము(5-7)మాత్రమే. దానినాధారముగా చేసికొని వారు ఆళ్వార్ తిరునగరి చేరి కణ్ణిమణ్ చిఱుత్తాంబు ప్రబంధమును పన్నెండు వేల పర్యాయములు జపించి నమ్మాళ్వర్ల అనుగ్రహమును పొంది తిరువాయిమొழிని తక్కిన ప్రబంధములను పొందగల్గిరి.
తిరుమழிశై ఆళ్వార్ "నడన్దకాల్‌గళ్‌నొన్దవో" యను పాశురమున స్వామీ! కావేరి తీరమున పవళించి యుంటివే! ముల్లోకములను కొలచి నందు వలన నీ శ్రీపాదములు నొచ్చుట చేతనా? లేక వరాహావతారమున భూదేవిని పైకి ఎత్తుట వలన కలిగిన శ్రమ చేతనా? లేచి కూర్చొని చెప్పుము" అని పలుకగా భక్తపరాధీనుడగు శార్జ్గ పాణి లేచుటకు సిద్ధపడగా ఆళ్వార్లు సేవించి అర్చావతార సమాది చెడకూడదని తలచి "వాழி" యని శయన తిరుక్కోలమునకు మంగళము పాడిరి. కావుననే ఇచట స్వామి "ఉత్ధానశాయి" గా సేవ సాయించుచున్నారు.
మార్గము: తమిళనాడులోని అన్ని ప్రసిద్ధ పట్టణముల నుండి బస్ సౌకర్యం గలదు.
నడన్దకాల్‌గళ్ నొన్దవో నడుజ్గ ఈలమేనమాయ్
ఇడన్ద మెయ్ కులుజ్గవో విలజ్గుమాల్ వరై చ్చురమ్
కడన్ద కాల్ పరన్ద కావిరిక్కరై క్కుడన్దైయుళ్
కిడన్ద వారెళున్దిరున్దు పేశువాழி కేశనే! ||
తిరుమழிశై ఆళ్వార్ తిరుచ్చన్ద విరుత్తం 61
ఆరావముదే! అడియేనుడలం నిన్బాల్ అన్బాయే
నీరాయలైన్దు కరైయ ఉఱుక్కుగిన్ఱ నెడుమాలే!
శీరార్ శెన్నెల్‌కవరి వీశుం శెழுనీర్ తిరుక్కుడన్‌దై
ఏరార్ కోలమ్ తిగழగక్కిడన్దాయ్! కణ్డేన్ ఎమ్మానే.
కళవాయ్ తున్బమ్ కళై యాదొழிవాయ్ కళైగణ్ మற்றிలేన్
వళైవాయ్ నేమిప్పడై యాయ్‌కుడన్‌దై కిడన్ద మామాయా!
తళరావుడలమ్ ఎనదావి శరిన్దు పోమ్పోదు
ఇళయాదు నదాళ్ ఒరుజ్గప్పిడిత్తు ప్పోద విశైనీయే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 5-8-1,8
ఆవియే! యముదే! యెననినై న్దురుగి అవరవర్ పణై ములై తుణయా
పావియే నుణరాదెత్తనై పగలుమ్ పొழுదుపో యొழிన్దన నాళ్‌గళ్
తూవిశేరన్నమ్ తుణైయొడుమ్ పుణరుమ్ శూழ் పునల్ కుడన్దైయే తొழுదు ఎన్
నావినాలుయ్య నాన్ కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్నుమ్ నామమ్!
తిరుమంగై ఆళ్వార్లు-పెరియతిరుమొழி 1-1-2