10. తిరువழ0దూర్ (మాయవరం 12 కి.మీ)
తేరళందూర్
శ్లో. దివ్యే దర్శన పద్మినీ తటగతే శ్రీ మత్యళందూర్ పురే
రాజ త్యామరువి ప్రభు ర్గరుడ ఇత్యాఖ్యే విమానే స్థిత: |
ప్రాప్త శ్శెంగమలోప పూర్వలతికాం ప్రాచీముఖ స్సహ్యజా
ధర్మ శ్రీ వసురాజ సేవిత వపు శ్శ్రీమత్కలిఘ్న స్తుత: ||
వివరణ: ఆమరువియప్పన్-శెంగమలవల్లి తాయార్-గరుడ విమానము-దర్శన పుష్కరిణి-తూర్పు ముఖము-నిలుచున్న సేవ-కావేరికిని, యమధర్మరాజునకు, వసుమహారాజునకు ప్రత్యక్షము. తిరుంగై ఆళ్వార్లు కీర్తించినది.
విశేషము: పెరుమాళ్లకు కుడివైపున గరుడాళ్వారు ఎడమవైపున ప్రహ్లాదాళ్వారు వేంచేసియున్నారు. ఇచ్చట కోవెల వీధిలో శ్రీ రజ్గనాథుల సన్నిధి, గోవిందరాజస్వామి సన్నిధి వేరుగా కలవు. వృషభ మాసం హస్తా నక్షత్రము తీర్థోత్సవముగా బ్రహ్మోత్సవము జరుగును. కంబ మహాకవి పుట్టిన ప్రదేశము.
మార్గము: మాయవరం నుండి టౌన్ బస్ కలదు. కుంభకోణం-మాయవరం-తంజావూరు-మాయవరం-బస్ కలదు. అహోబిల మఠం ఉన్నది.
తిరువుక్కున్దిరువాగియ శెల్వా దెయ్‌వత్తుక్కరశే శెయ్యకణ్ణా;
ఉరువచెఇజడరాழி వల్లనే యులగుణ్ణ వొరువా తిరుమార్బా;
ఒరువఱ్కాత్తియుయమ్ వగై యెన్ఱాలుడనిన్ఱైవ రెన్నుళ్ పుగన్దు;ఒழிయా
తరువిత్తిన్ఱిడ అఇజ నిన్నడై న్దేన్ అళున్దూర్ మేల్‌త్తిశై నిన్ఱ వమ్మానర్.
తిరుమంగై ఆళ్వార్ పెరియ తిరుమొழி 7-7
అర్ద పంచకము
ముముక్షువు తప్పక తెలిసికొనవలసినవి ఐదు
1. స్వస్వరూపము____________________భగవచ్చేషత్వము
2. పరస్వరూపము____________________సర్వశేషిత్వము
3. ఉపాయ స్వరూపము________________భగవత్ కృప
4. ఉపేయ స్వరూపము________________భగవత్ కైంకర్యము
5. విరోధ స్వరూపము_________________అవిద్య కర్మప్రకృతి సంబంధములు