పుట:DivyaDesaPrakasika.djvu/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

4. అన్బిల్ (బాణాపురం) - 4

లాల్గుడి నుండి 8 కి.మీ

శ్లోకము :
అన్బిల్ నామ్నిపురే ప్లవాఖ్య సరసీ సంశోభితే తారకే
శ్రీమూర్త్యుజ్జ్వల పూర్ణ నామక విభుర్భోగీంద్ద్ర భోగేశయ : |
ఆలింగన్ రుచిరోపపూర్వలతికా దేవీ సురేశాముఖో
వాల్మీకి ద్రుహిణప్రియో విజయతే శ్రీభక్తి సారస్తుత : |

వివ: తిరువడి వழிగియనంబి పెరుమాళ్ - అళగియవల్లి తాయార్ - మండూక పుష్కరిణి - తారక విమానము - తూర్పుముఖము - భుజంగ శయనము - వాల్మీకి మహర్షికి, బ్రహ్మకు ప్రత్యక్షము - తిరుమళిశై ఆళ్వార్ కీర్తించినది.

విశే: ఈ క్షేత్రము తిరుచ్చి - కల్లణై - కుంభకోణం బస్ మార్గములో కలదు తిరుచ్చి నుండి బస్ సౌకర్యం మితంగా కలదు. కావున "నటరాజపురం" బస్సులో పోయి అక్కడ నుండి 1 కి.మీ. నడచి సన్నిధికి చేరుట సులభము. ఇచట ఏ విధమైన వసతులు లేవు. శ్రీరంగము నుండి పోయి సేవింపవలెను. శ్రీరంగమునకు 20 కి.మీ. - 3 కి.మీ.లో తిరుప్పేర్ నగర్ కలదు.

నాగత్తణైక్కుడన్దై వె కాత్తిరువెవ్వుళ్;
నాగత్తణై యరజ్గమ్‌ పేరమ్బిల్ - నాగత్
త్తణై ప్పాఱ్కడల్ కిడుక్కుమ్‌ ఆది నెడుమాల్
అణై ప్పార్ కరుత్త నావాల్.
        (తిరుమழிశై ఆళ్వార్ - నాన్ముగన్దిరువన్దాది 36)

5. కరంబనూర్ (ఉత్తమర్ కోయిల్) - 5

శ్లోకము : రంభా వృక్షయుతే కదంబనగరే కాదంబ తీర్థాంచితే
పూర్వాఖ్యాప్రియయా భుజంజశయనో హ్యుద్యోగవైమానగ ః
ధ్యాత శ్శ్రీస్సనకాది యోగి కలిజిత్ కాదంబ వస్వాదిభి ః
ప్రాగాస్య ః పురుషోత్తమో విజయతే కీర్త్యః కలిద్వేషిణిః

వివ: పురుషోత్తమ పెరుమాళ్ - పూర్వాదేవి తాయార్ - కదంబ తీర్థము - ఉద్యోగ విమానము - తూర్పు ముఖము - భుజంగ శయనము - స్థల వృక్షము అరటిచెట్టు - సనకసనందాదులకు, కదంబ మహర్షికి, ఉపరిచర వసుమహారాజునకు తిరుమంగైయాళ్వార్లకు ప్రత్యక్షము. తిరుమంగైయాళ్వార్ కీర్తించినది.