పుట:DivyaDesaPrakasika.djvu/323

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వలన "ఎమ్బెరుమానార్" అను బిరుదమును పొంది వారి తిరుక్కుమారులైన తెఱ్కాళ్వార్ అనువారిని శిష్యులుగా స్వీకరించిరి.

శ్రీ తిరుమాలైయాణ్డాన్ అనువారివద్ద దివ్యప్రబంధవ్యాఖ్యానములను సేవించి శఠగోపన్ పొన్నడి అనుతిరునామముపొంది వారి కుమారులు సుందరత్తోళుడైయాన్ అనువారిని శిష్యులుగా స్వీకరించిరి.

అద్వైత సంప్రదాయమునకు చెందిన "యజ్ఞమూర్తి" అనువారిని వాదమున జయించి శిష్యులుగా స్వీకరించి "అరుళాళప్పెరుమాళ్ ఎంబెరుమానార్" అను తిరునామముంచిరి. తమ మేనల్లుడగు మొదలియాండాన్‌ను సగోత్రులగు కూరత్తాళ్వాన్‌ను శిష్యులుగా ననుగ్రహించిరి.

తిరుమల శ్రీనివాసునకు శంఖచక్రములు ప్రసాదించిరి. శ్రీవారి వక్షస్థలమున అలర్‌మేల్‌మంగైను ప్రతిష్ఠించి "శ్రీవేంకటేశ శ్వశుర" అను బిరుదము వహించిరి. తిరుక్కురుజ్గుడి నమ్బికి ద్వయమంత్రము నుపదేశించి "శ్రీవైష్ణవనంబి" యని తిరునామముంచిరి.

చోళరాజోపద్రవమున మేల్‌నాడు(మేల్‌కోటై ప్రాంతము) వేంచేసిరి. డిల్లీ పాదుషా వద్దనుండి "శెల్వపిళ్ళ" అను ఉత్సవమూర్తిని తీసికొనివచ్చి తిరునారాయణపురమున ప్రతిష్ఠించిరి. అచటవారి ప్రార్థనచే తమ అర్చామూర్తిని ప్రతిష్ఠించుటకు అనుమతించిరి. తమ శ్రీపాదములాశ్రయించిన వడుగ నంబికి మిధున సాలగ్రామమున శ్రీపాద తీర్థము ననుగ్రహించిరి.

బ్రహ్మ సూత్రములకు పూర్వాచార్య సురక్షితమైన యర్థముతో శ్రీభాష్యముననుగ్రహించి కాశ్మీరు శారదాపీఠమున శ్రీభాష్యకారులను బిరుదము వహించిరి. వీరనుగ్రహించిన గ్రంథములు 1 శ్రీ బాష్యము 2. వేదాంతసారము 3. వేదాంతదీపము 4. వేదార్ద సంగ్రహము 5. గద్యత్రయము 6. గీతాబాష్యము 7. నిత్యగ్రంథము.

శ్రీరంగనాథులచే "అత్త్రైవ శ్రీరజ్గేసుఖమాస్వ" అను అనుజ్ఞవడసి వారిచే ఉభయ విభూతి సాంరాజ్య పట్టాబిషిక్తులై నూటయిరువది సంవత్సరములు లీలా విభూతిలో వేంచేసియుండిరి.

వీరు అవతరించిన కాలమునందే "తిరునారాయణపురము, శ్రీ పెరుంబుదూరులలో వీరి అర్చా విగ్రహములు ప్రతిష్ఠింపబడెను. వీరి చరమతిరుమేని శ్రీరంగమున ప్రతిష్ఠింపబడెను.

ఈ విధముగా తమ ప్రభావముచే విశిష్టాద్వైత సిద్దాంతమును స్థాపించి తమ శ్రీపాదములాశ్రయించిన వారి నందరిని అనుగ్రహించిన కృపామాత్ర ప్రసన్నాచార్యులు

217