Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెరియనంబి

(మహాపూర్ణులు)

తిరునక్షత్ర తనియన్:-
    ధనుర్జ్యేష్ఠా సముద్బూతం యామునాజ్ఘ్రి సమాశ్రితం |
    మహాపూర్ణం యతీంద్రాయ మస్త్రరత్న ప్రధమ్బజే||
    దయా విఘ్నం యతీన్ద్రస్య దేశికం పూర్ణమాశ్రయే|
    యేవవిశ్వసృజో విష్ణో రపూర్యత మనోరథ:||
నిత్యతనియన్:-
    కమలాపతి కల్యాణ గుణామృత విషేవయా|
    పూర్ణకామాయ సతతం పూర్ణాయ మహతే నమ:||

పెరియనంబిగారు హేవళంబినామ సంవత్సరమున దనుర్మాసమున శుద్ద పంచమీ గురువారం జ్యేష్ఠా నక్షత్రమున శ్రీరంగమునందవతరించిరి. వీరు విష్వక్సేసుని పరివారములోని కుముదాంశ సంభూతులు. వీరికి పెరియనంబి, మహాపూర్ణులు; పరాంకుశ దాసులు మొదలగు తిరునామములు కలవు. వీరి కుమారులు పుణ్డరీకాక్షులు. కుమార్తె అత్తుళ్లాయమ్మగారు. వీరు శ్రీ ఆళవన్దారుల శ్రీపాదములాశ్రయించి సకలరహస్యార్థములను పొందిరి. తమ పతీర్థులయిన మాఱనేర్ నంబిగారికి బ్రహ్మమేద సంస్కారమును చేసిరి.

వీరు భగవద్రామానుజులకు ప్రదాన ఆచార్యులు. మధురాన్తకమున చక్రవర్తి తిరుమగన్ సన్నిధిలో భగవద్రామానుజులకు పంచ సంస్కారములను అనుగ్రహించిరి. కొంత బాగము దివ్యప్రబంధము కృపచేసిరి. చోళరాజోపద్రవమున కూరత్తాళ్వాన్లతో కలసి చోళరాజ సభకు పోయి దర్శన స్థాపన చేసి తమ దర్శనములు(కన్నులును) పోగొట్టుకొనినారు. తిరిగివచ్చునప్పుడు మధ్యే మార్గమున కూరత్తాళ్వాన్ ఒడిలో శిరస్సును కుమార్తె అత్తుళాయమ్మగారి ఒడిలో పాదములను ఉంచుకొని పరమపదించిరి. వీరనుగ్రహించిన గ్రంథము "తిరుప్పతి కోవై".

వాழி తిరునామజ్గళ్

అమ్బునియిల్ పదిన్మర్ కలై ఆయ్‌న్దురై ప్పోన్ వాழிయే
      ఆళవన్దార్ తాళిణైయై యడైన్దుయ్‌న్దోన్ వాழிయే
ఉమ్బర్ తొழுమరజ్గేశర్ క్కుగప్పుడై యోన్ వాழிయే
      ఓజ్గుతను క్కేట్దైదని లుదిత్తపిరాన్ వాழிయే
పమ్బవిழ்తార్ పరదరులై వాழி శెయ్‌దాన్ వాழிయే
      మాఱనేర్ నమ్బిక్కు వాழ் వళిత్తాన్ వాழிయే
ఎమ్బెరుమానార్ మునివర్ క్కితమురైత్తాన్ వాழிయే
      ఎழிల్ పెరియనమ్బి శరణ్ ఇనితూழி వాழிయే

210