ఉయ్యక్కొండార్
తిరునక్షత్రతనియన్:-
మేషమాసే సరోజాక్షం కృత్తికా జాత మాశ్రయే
నాథయోగి సదామ్బోజ ద్వస్ద్వ ప్రవణ మానసమ్||
నమస్యామ్యరవిన్దాక్షం నాథభావే వ్యవస్థితమ్|
శుద్ద సత్త్వమయం శౌరే రవతార మివాపరమ్||
నిత్యతనియన్:-
నమ: పంకజనేత్రాయ నాథ శ్రీపాద పజ్కజే|
స్వస్త సర్వభరాయాస్మత్ కులనాథాయ ధీమతే||
నాథమునుల శిష్యులు ఉయ్యక్కొండార్, పుండరీకాక్షులనునది వీరి తిరునామము. వీరు మేష మాసమున కృత్తికా నక్షత్రమునందు తిరువెళ్ళరై క్షేత్రము నందవతరించిరి. వీరు సేనమొదలి యాళ్వార్ల మంత్రియగు జయత్సేనుని అంశము.
నాథమునుల మామగారు వంగిపురత్తు నంబి. వారి కుమార్తె అరవిందా ప్పావైయాళ్. ఆమెను చూడగోరి పిలువ నంపగా నాథమునులు ఆమెకు ఉయ్యక్కొండారును సహాయముగా పంపిరి. అచట వీరిని పురశ్చూడులుగా చూచినవారు వీరికి వేరుగా భోజనము పెట్టిరి. ఉయ్యక్కొండారును సంతోషముతో భుజించి తిరిగి వీరనారాయణపురము చేరిరి.
విషయము తెలిసిన నాథమునులు ఉయ్యక్కొండారును ప్రశ్నింపగా వారు "మీ శిష్యునిగా నన్ను గౌరవింపక నాలోని నైచ్యమును గుర్తించినందులకు" నాకు పరమ సంతోషమైనదని పలికిరి. వారి నైచ్యాను సందానమునకు ఆశ్చర్యపడిన నాథమునులు వారిని చూచి "ఎన్నై ఉయ్యక్కొండేరో"(నన్ను ఉజ్జీవింప వచ్చినారా) అని పలికిరి. తదాదిగావీరికి ఉయ్యక్కొండార్ అను తిరునామమేర్పడినది.
నాథమునులు యోగరహస్యములు తెలిసినవారు-కానీవీరు "పిణంకిడక్క మణంపురి వారుండో!" శవము ఉండగా వాసన చూచువారుందురా! అనితలచి అష్టాంగ యోగమును వదలి అర్చావతారవైభవమును ప్రతిపాదించు దివ్య ప్రబంధములను నాథమునులవద్ద అధ్యయనముచేసి వాని అర్థములు తెలిసికొని లోకమునకు అనుగ్రహించుటచే వీరికి "ఉలకై ఉయ్యక్కొండార్" (లోకములను రక్షింప వచ్చినవారు) అనిపేరువచ్చెను.
వీరునాథమునుల తరువాత దర్శన ప్రవర్తకులుగా వేంచేసియుండిరి. వీరి