పుట:DivyaDesaPrakasika.djvu/309

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు

శ్రిమతే రామానుజాయనమ:

ఆచార్యవైభవము

శ్రీమన్నాథమునులు

(శ్రీరంగనాథమునులు)

తిరునక్షత్రతనియన్:-
    జ్యేష్ఠ మాసే త్వనూరాధా జాతం నాథమునిం భజే|
    యచ్చ్రీ శఠారే శ్శ్రుతవాన్ ప్రబన్ద మఖిలం గురో:||
నిత్యతనియన్:-
    నమో చిన్త్యా ద్భుతాక్లిష్ట జ్ఞాన వైరాగ్య రాశయే
    నాథాయ మునయే గాధ భగవద్బక్తి సిందవే||

పూర్వాచార్య పరంపరలో ప్రథములు శ్రీమన్నాథమునులు. వీరు వీరనారాయణ పురమున (కాట్టుమన్నార్ కోయిల్) "శోభకృత్" నామ సంవత్సర మిదునమాసమున (జ్యేష్ఠమాసమున) అనూరాదా నక్షత్రమున బుదవారమున గణేశాంశమున ఈశ్వరభట్టర్ అనువారికి కుమారులుగా నవతరించిరి.

ఒకనాడు ఆళ్వార్ తిరునగరి నుండి వేంచేసిన కొందరు స్వాములు మన్నార్ పెరుమాళ్లను సేవించి నమ్మాళ్వార్ అనుగ్రహించిన తిరువాయిమొழிలోని "ఆరావముదే" అను దశకమును అనుగ్రహింపగా నాథమునులు విని ఆనందనిర్బరులై తిరువాయిమొழிని పూర్తిగా వినవలెనని కుతూహలపడి స్వాములను ప్రార్థించిరి. స్వాములును తిరువాయిమొழி ఈ పది పాశురములు తక్క మిగిలిన భాగము ప్రణష్టమై నదని తెలుపగా చింతించి నాథమునులు ఎట్లైనను తిరువాయిమొழிని సంపాదింపవలెనని యెంచి ఆళ్వార్ తిరునగరిని చేరిరి.

అచట నిర్ణిద్ర తింత్రిణీ వృక్షముక్రింద సుఖాసీనులై వేంచేసియున్న ఆళ్వార్లను సేవించి వారి విషయమై మధురకవి యాళ్వార్లనుగ్రహించిన "కణ్ణిమణ్ శిరుత్తాంబు" ప్రబంధమును పండ్రెండువేల పర్యాయములు జపించిరి. అంత నమ్మాళ్వార్లు యోగమున నాథమునులకు సాక్షాత్కరించి నాలాయిర దివ్య ప్రబంధముల ననుగ్రహించిరి.

నాథమునులును సంతుష్టాంతరంగులై కాట్టుమన్నార్ కోయిల్‌చేరి తమమేనల్లుళ్ళగు "కీళయకత్తాళ్వార్" మేలైయకత్తాళ్వార్" అనువారలకు నేర్పి

203