పుట:DivyaDesaPrakasika.djvu/307

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుమంగై ఆళ్వార్లు

తిరునక్షత్ర తనియన్:-
   వృశ్చికే కృత్తికా జాతాం చతుష్కవి శిఖామణిమ్‌|
   షట్ర్సబంధ కృతం శార్జ్గ మూర్తిం కలిహ మాశ్రయే||
నిత్య తనియన్:-
   కలయామి కలిధ్వంసిం కవిం లోక దివాకరమ్‌
   యస్య గోభి: ప్రకాశాభి రావిద్యం విహతం తమ:||

వీరు కలియుగాది 397 సంవత్సరమునకు సరియగు "నళ" నామ సంవత్సర వృశ్చిక(కార్తిక)మాస శుక్ల పక్ష పూర్ణిమా గురువారమున కృత్తికా నక్షత్రమున శార్జ్గాంశమున "తిరుక్కుఱైయలూర్" అను దివ్యదేశమునందవతరించిరి. వీరికి తండ్రిగారుంచిన తిరునామము "నీలనిఱైత్తర్".

వీరు పద్మాంశమున జన్మించిన కుముదవల్లి నాచ్చియార్లను వివాహము చేసికొనిరి. అందులకై వీరు శ్రీవైష్ణవ తదీయారాధన నిర్వహించుచు ద్రవ్యమునకై చౌర్యమును చేయదొడగిరి. వీరి అద్యవసాయమును పరీక్షింపదలచి పెండ్లికుమారుని వేషమున వచ్చిన శ్రియ:పతిని గూడ దోచి స్వామి శ్రీపాదస్పర్శచే జ్ఞానోదయముకాగా "నాన్‌కణ్డు కొణ్డేన్ నారాయణా వెన్ఱుం నామమ్" అని తిరుమంత్రమును ప్రకాశింపజేసిరి.

వీరు తమ శిష్యులతో కలసి దివ్యదేశ సంచారముచేయుచు పెరుమాళ్లకు మంగళాశాసనము చేయుచుండిరి. మరియు వేదబాహ్యులైన జైన బౌద్దాదులను జయించి ఆద్రవ్యముతో శ్రీరంగనాథులకు మణి మంటప ప్రాకారాదులు నిర్మించిరి.

వీరు నమ్మాళ్వార్లు అనుగ్రహించిన చతుర్వేద సారభూతమైన నాల్గు ప్రబంధములకు షడంగములుగా ఆరుప్రబంధములను అనుగ్రహించిరి. వీరివైభవము వాచామగోచారము. దానిని గురుపరంపరా ప్రభావాది గ్రంథములలో సేవింపవచ్చును.

ఆళ్వార్లు: తిరుమంగై ఆళ్వార్లు
తిరునక్షత్రం: వృశ్చికమాసం-కృత్తిక
అవతారస్థలం: తిరుక్కుఱైయలూర్
ప్రబంధములు: 1 పెరియతిరుమొழி 2 తిరుక్కురున్దాణ్డగమ్‌ 3 తిరునెడున్దాణ్డగమ్‌ 4 తిరువెழுక్కూత్తిఱుక్కై 5 పెరియ తిరుమడల్ 6 శిఱయ తిరుమడల్.
మంగళాశాసనంచేసిన దివ్యదేశములు: 86

201