ఈ పుట ఆమోదించబడ్డది
ద్వారకా తిరుమల - 52
శ్రీవేంకటేశ్వరస్వామి-సుదర్శన తీర్థము-నిలచున్నసేవ-తూర్పుముఖము-ద్వారకా మహర్షికి ప్రత్యక్షము.
విశే: ద్వారక మహర్షి కోరికపై స్వామి కొండపై వెలసినాడు. మిక్కిలి ప్రాచీనమైన సన్నిధి. తిరుపతి క్షేత్రమును సేవింపలేనివారు ఈ స్వామిని సేవించి కానుకలర్పింతురు.
ప్రసిద్ధ ప్రార్థనా స్థలము-ఈస్వామి భక్తుల పాలిటి కొంగుబంగారము.
మార్గము: విజయవాడ-రాజమండ్రి స్టేషనుల భీమడోలు స్టేషన్ నుండి 20 కి.మీ. ఏలూరు, తాడేపల్లిగూడెం, విజయవాడ నుండి బస్‌వసతి కలదు.
173