Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/268

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండరీపురము - 29

ఇది ప్రసిద్ద పుణ్యక్షేత్రము-ఇచట స్వామిపేరు పాండురంగ విఠలుడు. రుక్మిణీదేవి-చంద్రభాగానది-భీమతీర్థం-శ్రీకృష్ణతీర్థం-జ్ఞానానందవిమానం-నిలచున్నసేవ-తూర్పుముఖము-పుండరీక మహర్షికి ప్రత్యక్షము.

ఇచట స్వామి ఒక యిటుక రాతిమీద వేంచేసియుందురు. భక్తులు శ్రీస్వామివారి పాదములను స్పృశించి సేవింపవచ్చును. సన్నిధి చంద్రభాగానది యొడ్డున కలదు. నదియొడ్డున గల "రామ్‌బాగ్" వసతిగృహము వసతికి అనుకూలముగా నుండును.

మార్గము: ఇది మహారాష్ట్ర లోనిది-షోలాపూర్ నుండి బస్‌లో వెళ్లవచ్చును. {{center|

నాసిక్ - పంచవటి - 30

శ్రీరాములవారి సన్నిధి-సీతాదేవి-గోదావరినది.

లక్ష్మణస్వామి శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసిన ప్రదేశము. శ్రీరామచంద్రుడు సీతాదేవితో విహరించిన పుణ్యస్థలము.-మారీచ వధ ఇక్కడనే జరిగినది. ఇచటగల శంకరమఠము వసతికి అనుకూలము. ఐదుమఱ్ఱి చెట్లు గుంపుగా నుండుటచే పంచవటియనిపేరు. వీని మధ్య సారంగము కలదు. ఖరదూషణ పద సమయమున శ్రీరాముడు సీతను ఈసారంగములో నుంచెనట.

మార్గము: ఇది మహారాష్ట్ర లోనిది. బొంబాయి నుండి-నాసిక్ రోడ్ స్టేషన్‌దిగి అచట నుండి 10 కి.మీ. బస్‌లో వెళ్లి ఈ క్షేత్రమును చేరవచ్చును.

162