ఈ పుట ఆమోదించబడ్డది
పెంటపాడు - 28
బాల వేంకటేశ్వరస్వామి-ఆనందవిమానము-స్వామిపుష్కరిణి-తూర్పుముఖము-నిలచున్నసేవ.
వివ: ఈస్వామివరప్రదుడు. ఈఅగ్రహారము ఒకప్పుడు శ్రీవైష్ణవమత ప్రచారమునకు ప్రముఖస్థానమై విరాజిల్లినది. ఈస్వామి సన్నిధానములో జరిగిన ఉభయ వేదాంత సభలలో ప్రసిద్దులైన పండితులు పలువురు పాల్గొనెడివారు. శ్రీవైష్ణవపత్రిక ఇచట నుండియే వెలువడుచుండినది. ఇటీవల "శ్రీమత్పరమహంసేత్యాది" శ్రీశ్రీశ్రీ త్రిదండి చినశ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళా శాసనములతో "ఉభయవేదాన్త సభ స్థాపింపబడి" ఉభయవేదాన్త సభలను నిర్వహించుచు, "భక్తామృతమను" పత్రికను సంప్రదాయమునకు సంబంధించిన పుస్తక ప్రచురణమును చేపట్టినది. ఆకృషి పలితమే ఈదివ్యదేశ వైభవ ప్రకాశిక.
మార్గము: మద్రాసు-కలకత్తా రైలుమార్గములో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్‌కు (పశ్చిమగోదావరిజిల్లా) 4 కి.మీ.
161