పుట:DivyaDesaPrakasika.djvu/213

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


భగవద్రామానుజుల కైంకర్యములు

భగవద్రామానుజులు ఈ సన్నిధిలో గావించిన కైంకర్యములు అనేకములు. అవినేటికిని మనకు మనకు దర్శనీయములై యున్నవి. వీరు వేంకటాచలపతికి శంఖచక్రములను ప్రసాదించినారు. స్వామి వక్షస్థలమున ద్విభుజయగు వ్యూహ లక్ష్మిని శుక్రవారం ద్వాదశి ఉత్తర ఫల్గునీ నక్షత్రముతో కూడిన రత్నమాలికా యోగమున సమర్పింప జేసినారు. కావుననే ప్రతి శుక్రవారం స్వామికి తిరుమంజనం జరుపుచున్నారు. ఈ సమయంలో పిరాట్టి ప్రీతికొఱకు నాచ్చియార్ తిరుమొழிని అనుసంధింతురు.

పూర్వం ఈస్వామి బ్రహ్మోత్సవములు "తిరుచ్చానూరు"(తిరుచ్చుగనూరు)లో జరిగేవట-కానీ రామానుజులవారు ఈ ఉత్సవములు కొండమీదనే జరిగేలాగున అచటి సన్నిధి చుట్టు వీధులను నిర్మింపజేసి భక్తులకు అవాస యోగ్యము గావించి అది మొదలు స్వామి వారి బ్రహ్మోత్సవాలు అక్కడే జరిగేటట్లు చేశారు.

ఈ సన్నిధిలో కౌతుక బేరంగా ఉండిన "మలైకువియా నిన్ఱపెరుమాళ్ళను" ఉత్సవమూర్తిగాను అప్పటివరకు ఉత్సవమూర్తిగా ఉండిన "వేంగడత్తుఱైవార్" అనువారిని కౌతుక బేరంగాను ఆలయ వైభవాభివృద్ధికై మార్పు చేయించినారట రామానుజులవారు. ఈ "మలైకువియా నిన్ఱ పెరుమాళ్లనే" మలైయప్పన్ అని అంటారు.

ఇట్లే ఈ సన్నిధిలో అర్చకులుగా "శెంగవిరాయన్" అను వైఖానస ఆచార్య సత్తముల వంశీయులే ఉండవలయునని నియమించినారు. స్వామి పుష్కరిణీ తీరమునగల వరాహ ప్పెరుమాళ్ల సన్నిధిలో ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి తులా (అల్పిశి) మాసం శ్రవణం నాడు తిరునక్షత్రోత్సవమును నిత్య తిరువారాదనమును యథావిధిగా జరుగునట్లు కట్టడి చేసినారు.

ఒకప్పుడు ఈ ఆలయం శత్రు సమాకాస్తం కాగా పర పురుష స్పర్శనొల్లని పెరియపిరాట్టి (శ్రీదేవి) స్వామి వక్షస్థలమును చేరగా భూపిరాట్టి (భూదేవి) ఉద్యానవనమున గల "అழగప్పిరానార్" అను బావియందు ప్రవేశించినారట.

శ్రీ ఆళవందారులు తిరుమలైకి వేంచేసినపుడు ఒక సందర్బంలో "మారిమారాద తణ్ణమ్మలై" అనునట్లు సంతత వర్షాతిశయమును చూచి ఇట్టి వర్షాతిశయ సమయములలో తిరుమంజన తీర్థము పాపవినాశం నుండి తేనవసరం లేదని ఈ నందనో ద్యానమునగల "అழగప్పిరానార్" అను ఈ బావితీర్థమును వినియోగింప వచ్చునని ఆనతిచ్చిరట. ఈ బావికి "అழగప్పిరానార్" అను దివ్యనామము నుంచినవారు శ్రీఆళవందారులే. స్వామి రామానుజులు ఆనామమునే స్థిరపరచి దాని సమీపంలో భూదేవిని శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠింపజేసినారు.

                            121