పుట:DivyaDesaPrakasika.djvu/209

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

96. తిరువేంగడమ్‌ (తిరుమలై-తిరుపతి) 1

శ్లో. శ్రీమద్వేంకట శైలరాజ శిఖరే శ్రీ శ్రీనివాసో హరి:
   శ్రీమత్ స్వామి సరోవర ప్రభృతిభి: పుణ్యైరనేకైర్యుతే
   తీర్థై:ప్రాజ్ముఖ సంస్థితి ర్విజయతే శ్రీతొండమానాదిభి:
   దృష్ట: శ్రీ నవసూరి సంస్తుత వపు స్త్వాలింగ్య పద్మావతీమ్‌||
   శ్రీ వేంకట గిరీశోయం అలర్ మేల్ మంగనాయకీమ్‌|
   ఆశ్రితో రాజతే నిత్యం ఆనంద నిలయాలయ:||

వివ: శ్రీవేంకటేశ్వరుడు(తిరువేంగడ ముడయాన్)-అలర్‌మేల్ మంగై తాయార్(పద్మావతి)-స్వామిపుష్కరిణి మున్నగు పలుతీర్థములు-తూర్పుముఖము-నిలచున్నసేవ-ఆనందనిలయ విమానము-తొండమాన్ చక్రవర్తి మున్నగువారికి ప్రత్యక్షము-తొండరడిప్పొడి యాళ్వార్ తప్ప మిగిలిన యాళ్వార్లు ఆండాళ్ కీర్తించిన స్థలము.

విశే: "కలౌవేంకటనాయక:" అని ప్రసిద్ధి చెందిన క్షేత్రము.వడవానై(ఉత్తరదిగ్గజము) అని తిరుమంగై యాళ్వార్ల వర్ణనము. "వడక్కుత్తిరుమలై" యని(వడ తిరువేంగడం) "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు" అని సాంప్రదాయక తిరునామములు గలవు. ఈక్షేత్రమునకు పుష్పమంటపమనియు తిరునామము కలదు. అనంతాళ్వాన్ అను మహాత్ములు పుష్కరిణిని నిర్మించిరి. కురుబరుత్తనంబి స్వామికి ఆంతరంగికులు. పెరియ తిరుమలై నంబి గారు ఈమలై మీద వేంచేసి స్వామి కైంకర్యము నిర్వహించెడివారు.

అష్ట స్వయం వ్యక్త క్షేత్రములలో తిరుమల యొకటి. శ్రీ వైష్ణవులు అత్యంతము అభిమానించి సేవించు నాల్గుక్షేత్రములలో "తిరుమలై" రెండవది.

   మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌
   స్వామిపుష్కరిణీ తీరే రమయా సహమోదతే.

శ్రీమన్నారాయణుడు పరమానంద స్వరూపమైన శ్రీవైకుంఠమును విడచి స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు, అనియు

   "శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
    రమయా రమమాణాయ వేజ్కటేశాయ మంగళమ్‌"

("శ్రీవైకుంఠమున విరక్తుడైన స్వామి, స్వామి పుష్కరిణీ తీరమున లక్ష్మీదేవితో కలసి ఆనందించుచున్నాడు") అనియు చెప్పినట్లుగా శ్రీవైకుంఠనికేతనుడైన స్వామి భక్త సంరక్షణ దీక్షితుడై తిరుమలపై వేంచేసియున్నాడు.

                        117