పుట:DivyaDesaPrakasika.djvu/210

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

   "కృతేయుగే నారసింహ: త్రేతాయాంరఘునందన:
    ద్వాపరే వాసు దేవశ్చ కలౌవేంకటనాయక:"

అని చెప్పినట్లుగా కృతయుగమున నరసింహస్వామి, త్రేతాయుగమున శ్రీరామచంద్రులు, ద్వాపరయుగమున శ్రీకృష్ణపరమాత్మ; కలియుగమున శ్రీవేంకటేశ్వరస్వామి భక్తరక్షణ దీక్షితులై యున్నారు.

స్వామి వేంచేసియున్న ఈ వేంకటాద్రి శ్రీవైకుంఠము నుండి గరుడాళ్వార్లచే భూమికి తీసికొని రాబడినది. కావున వైకుంఠాద్రి యనియు, ఆదిశేషావతారమై, శేషాకారముగా నుండుటచే శేషాద్రియని, గరుడాళ్వార్ తీసికొని వచ్చుటచే గరుడాద్రియని; పేరువచ్చినది. మరియు ఈ వేంకటాచలమునకు

   "అంజనాద్రి: వృషాద్రిశ్చ శేషాద్రి: గరుడాచల:
    తీర్థాద్రి: శ్రీ నివాసాద్రి: చిన్తామణి గిరిస్తథా
    వృషభాద్రి: వరాహాద్రి: జ్ఞానాద్రి: కనకాచల:
    ఆనన్దాద్రిశ్చ నీలాద్రి: సుమేరు శిఖరాచల:

వైకుంఠాద్రి:పుష్కరాద్రి:"ఇతినామాని నింశతి:"|| యని యిరువది పేర్లు కలవు. ఏమైనను

"వేజ్కటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేజ్కటేశ నమోదేవో సభూతో సభవిష్యతి" యని భక్తులచే సేవింపబడు చున్నదీ క్షేత్రము.

భోగమంటపాదులుగా ప్రసిద్దములైన క్షేత్రములలో తిరుమలై పుష్పమండపము మిగిలినవి శ్రీరంగము (భోగమండపము) కాంచీపురము (త్యాగ మండపము)

    దివ్యదేశము______మండపము__________మంత్రము________ప్రమాత
    శ్రీరంగము_______భోగమండపము_______తిరుమంత్రము______తిరుప్పాణన్
    కాంచీపురము____త్యాగమండపము_______ద్వయము________తిరుకచ్చినంబి
    తిరుమలై______పుష్పమండపము______చరమశ్లోకము____కురుంబరుత్తనంబి
అని ఆళవందారుల శ్రీసూక్తి.

"నమ్మాళ్వార్ ఈక్షేత్రమును "మణ్ణోర్ విణ్ణోర్ వైప్పు (భూలోక వాసులకును పరమపద వాసులకును సమానుడు)" అని అబివర్ణించియున్నారు. (కణ్ణావా నెన్ఱుమ్‌ మణ్ణోర్ విణ్ణోర్‌కు" తి.వా.మొ 1-8-3) తిరుమంగై యాళ్వార్ "వడవానై"(ఉత్తర దిశాదిగ్గజము తిరునెడున్దాణ్డగమ్‌ 10) అనిస్తోత్రము చేసియున్నారు. మరియు ఈక్షేత్రమునకు "వడక్కుత్తిరుమలై" యని సంప్రదాయక తిరునామము. తెఱ్కుత్తిరుమలై తిరుమాలిరుంజోలమలై.

                          118