81. ఊఱగమ్ (కాంచీ) 5
శ్లో. తిరువూరగాఖ్య నగరే త్రివిక్రమో వరనాగ తీర్థ రుచిరే స్థితి ప్రియ:
అమృతాభిధాన లతికా సమన్వితో| జలనాథ దిజ్ముఖయుతో విరాజతే||
సారశ్రీకర వైమానం నాగేశాక్ష్యతిధి శ్రిత:|
భక్తిసార కలిద్వేషి స్తుతి భూషణ భూషిత:||
వివ: త్రివిక్రముడు(ఉళగన్ద పెరుమాళ్)-అమృతవల్లి త్తాయార్-నాగతీర్థము-పశ్చిమ ముఖము-నిలచున్నసేవ-సారశ్రీకర విమానము-ఆదిశేషులకు(ఊరగమ్)ప్రత్యక్షము-తిరుమళిశై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
మార్గము: ఈ క్షేత్రము కంచిలో కామాక్షి కోవెలకు సమీపములో నున్నది. ఈ సన్నిధిలోనే నీరగమ్,కారగమ్-కార్వానం సన్నిధులు కలవు.
పా. కల్లెడుత్తుక్కల్ మారికాత్తా యెన్ఱుమ్
కామారుపూజ్గచ్చి యూరగత్తాయెన్ఱుమ్
విలిఱుత్తు మెల్లియల్‌తోళ్ తోయ్‌న్దా యెన్ఱుమ్
వెஃకావిల్ తుయిలమర్‌న్ద వేన్దే యెన్ఱుమ్
మల్లడర్తు మాకీణ్డ కైత్తలతైన్ మైన్దా వెన్ఱుమ్
శొల్లడుత్త త్తన్ కిళియై చ్చొల్లే యెన్ఱు
తుణైములైమేల్ తుళిశోరచ్చోర్ గిన్ఱాళే.
తిరుమంగై ఆళ్వార్-తిరునెడున్దాణ్డగమ్ 13
మంచిమాట
బంగారమును పుటము వేసినచో అందలి మాలిన్యము తొలగి తూకము తరగిపోవును. కానీ ప్రకాశము అధికమగును. అట్లే ఈ ఆత్మ కూడ జ్ఞాన సంకోచమను మాలిన్యము తొలగించుకొన్నచో జ్ఞాన వికాసమనెడి కాంతి కలుగును. అపుడీ ఆత్మను భగవంతుడు లక్ష్మీదేవితో సమానముగా భావించి ఆదరించును.
"తిరుక్కోట్టియూర్ నంబి""
100