Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పా. అత్తియూరాన్ పుళ్ళై యూర్వాన్; అణిమణియిన్
   తుత్తిశేర్ నాగత్తిన్‌మేల్ తుయిల్వాన్;ముత్తి
   మఱైయావాన్ మాకడల్ నజ్గుణ్డాన్ఱనక్కుమ్‌
   ఇఱైయావా నెజ్గళ్ పిరాన్
          పూదత్తాళ్వార్-ఇరణ్డాన్దిరువన్దాది 96.

పా. శిఱన్దవెన్ శిన్దైయుమ్‌ శెజ్గణరవుం
    నిఱైన్దశీర్ నీళ్‌కచ్చియుళ్ళుమ్‌-ఉఱైన్దదువుమ్‌
    వేజ్గడముమ్‌ వెஃకావుం వేళుక్కైప్పాడియుమే,
    తామ్‌కడవార్ తణ్డుழாయార్.
          పేయాళ్వార్-మూన్ఱాం తిరువన్దాది. 26

75. అష్ట భుజమ్‌ (కాంచీ) 2

శ్లో. తత్తైవాష్ట భుజిక్షేత్ర గజేంద్ర సరసీయుతే
   గగనాకృతి వైమానే పశ్చాత్‌వక్త్ర స్థితి ప్రియ:||
   అలర్‌మేల్ మంగై నాయక్యా త్వాదికేశవ నాయక:|
   మహాముని కలిఘ్నాభ్యాం కీర్త్య:కరివరార్చిత:||

వివ: ఆదికేశవ పెరుమాళ్-అలర్‌మేల్ మంగై త్తాయార్-గజేంద్ర పుష్కరిణి-గగనాకృతి విమానము-పశ్చిమ ముఖము-నిలుచున్నసేవ-గజేంద్రునకు ప్రత్యక్షము-పేయాళ్వార్-తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: విష్ణుకంచిలో గలక్షేత్రము. వరదరాజస్వామి సన్నిధికి 1/2 కి.మీ. దూరములో గలదు. ఈ క్షేత్రస్వామి విషయమై శ్రీ వేదాంత దేశికులు అష్ట భుజాష్టకమును అనుగ్రహించిరి.

పా. తిరిపుర మూన్ఱెఱిత్తానుమ్‌ మற்றை; మలర్‌మిశై మేలయనుమ్‌ వియప్ప;
   మురితిరై మాకడల్ పోల్ ముழజ్గి; మూవులకుమ్‌ ముఱైయాల్ వణజ్గ;
   ఎరియెవ కేశరి నాళె యిற் తోడిరణియనమిరణ్డు కూరా
   అరియురువా మివరార్ కొలెన్న; వట్టపు యకరత్తే వెన్ఱారే.

   శమ్బొనిలజ్గు ఫలజ్గై వాళి;తిణ్ శిలై తణ్డొడు శజ్గమొళ్ వాళ్
   ఉమ్బ రిరుశుడ రాழிయోడు;కేడక మొణ్ మలర్ పత్‌తి యెత్‌తే,
   వెమ్బు శినత్తడల్ వేழమ్‌ వీழ; వెణ్ మరుప్పొన్ఱు పఱిత్తు, ఇరుణ్డ
   అమ్బుదమ్బోన్ఱి వరార్ కొలెన్న; వట్టపు యకరత్తే నెన్ఱారే.
         తిరుమంగై ఆళ్వార్లు-పెరియ తిరుమొழி 2-8-1,3

                                       95