పుట:DivyaDesaPrakasika.djvu/14

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

భరితులై - పూర్తి ప్రబన్దం దొరకనందున ఆళ్వార్ తిరునగరికి చేరి ఆనాటి పెద్దల ఆదేశానుసారం "కణ్ణిమణ్ శిఱుత్తామ్బు" అను నమ్మాళ్వార్ విషయకమైన దివ్యప్రబన్దమును 12 వేల పర్యాయములు అనుసందించి నమ్మాళ్వారుల అనుగ్రహమునకు పాత్రులై యోగదశలో వారివలన ఆళ్వారులందరి దివ్య ప్రబన్దములను ఉపదేశము పొందిరి. ఈ విధముగా వీరు నమ్మాళ్వారులకు శిష్యులై ద్రావిడ వేదాన్త సంప్రదాయమునకును ప్రవర్తకులైనారు.

వీరు తాము "ఉపదేశము పొందిన దివ్య ప్రబన్దములను నాలుగు వేలుగా వర్గీకరించినారు. ఇవి వ్యాసభగవానునిచే వర్గీకరింపబడిన నాలుగు వేదములకు ప్రతిరూపములని సంప్రదాయము. మరియు నమ్మాళ్వారులు అనుగ్రహించిన నాలుగు దివ్య ప్రబన్దములు నాలుగువేదముల ప్రతిరూపములు.

1. ౠగ్వేదము___________________________తిరుచ్చంద విరుత్తం
2. యజుర్వేదము__________________________తిరు వాశిఱియం
3. అధర్వణవేదము_________________________పెరియ తిరువన్దాది
4. సామవేదము___________________________తిరువాయిమొழி

ఈ నాలుగు దివ్య ప్రబన్దములకును తిరుమంగై యాళ్వార్ అనుగ్రహించిన ఆరు ప్రబన్దములు వేదాలకు షడంగములవలె ఒప్పుచున్నవి. తక్కిన ఆళ్వారుల దివ్య ప్రబన్దములు ఉప బృంహకములు అని సంప్రదాయము.

నాలాయిర విభజన క్రమము

1. ముద లాయిరమ్

1. తిరుప్పలాణ్డు
2. పెరియాళ్వార్ తిరుమొழி
3. తిరుపావై
4. నాచ్చియార్ తిరుమొழி
5. పెరుమాళ్ తిరుమొழி
6. తిరుచ్చన్ద విరుత్తం
7. తిరుమాలై
8. తిరుప్పళ్ళి యెழுచ్చి
9. అమలనాది పిరాన్
10. కణ్ణిమణ్ శిఱుత్తామ్బు