పుట:DivyaDesaPrakasika.djvu/124

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

50. తిరుత్తొల విల్లి మంగలమ్‌ 10 (ఇరెట్టై తిరుప్పతి)

శ్లో. దివ్యే శ్రీతొలవిల్లి మజ్గల పురే శ్రీతామ్రపర్ణీతటే
   ప్రోప్తే వారుణ తీర్థకం శఠరిపు స్తుత్య స్సురేశానవ:|
   నాయక్యా మరవింద లోచన విభూ రక్త: కరుంకణ్ణితి
   ప్రోప్యేంధే కుముదం విమాన మనిల స్తీర్థేశ శక్రేక్షిత:||

వివ: తేవ పిరాన్-అరవిందలోచనుడు-కరుందడం కణ్ణి తాయార్-తామ్రపర్ణీ నది-వరుణ తీర్థము-కుముద విమానము-తూర్పు ముఖము-నిలచున్న సేవ-కూర్చున్న సేవ-ఇంద్ర, వరుణ వాయువులకు ప్రత్యక్షము-నమ్మాళ్వార్ కీర్తించినది.

విశే: ఇవిరెండు క్షేత్రములగుటచే ఇరట్టె తిరుపతియని వ్యవహారము. ఈ క్షేత్రము అరణ్యప్రాంతములో నుండుటచే అర్చకులతో కలసి సేవింపవలెను. నమ్మాళ్వార్ ఈక్షేత్రమునకు "అవ్వూర్"(ఆ దివ్యదేశము) 6-5-9 అను విలక్షణమైన తిరునామమును అనుగ్రహించిరి. "తువళిల్ మామణి మాడమ్‌" అను దశకములో(తిరువాయిమొழி6-5-11) "తేవపిరానైయే తన్దైతాయ్" అని (దేవపిరాన్‌సర్వేశ్వరుడే తండ్రి తల్లియని) సర్వేశ్వరుని సకలవిధ బంధువుగా కీర్తించి బంధుత్వగుణమును ప్రకాశింపజేసిరి.

నమ్మాళ్వార్లు తోழிమార్ అవస్థలో (సఖీభావనలో) చెప్పిన దశకములు మూడు. 1.తీర్‌ప్పారయామిని 2. తువళిల్‌మామణిమాడమ్‌ 3. కరుమాణిక్కమలై మేల్. ఇందు రెండవదియగు "తువళిల్ మామణిమాడమ్" అను దశకమున" అరవిందలోచనుని సేవించినది మొదలు ఆళ్వార్ల నాయికి అతని స్వరూపమున గుణచేష్టితములనే పలవరించుచు మన వశము తప్పియున్నది." అని చెలికత్తెలు ఆళ్వార్ల తల్లిగారికి నివేదించుచున్నట్లు ఈ దశకము సాగినది.

సూచన: ఇది తామ్రపర్ణీనదీ తీరమున గల దివ్యదేశము. ఈక్షేత్రమునకు సమీపమున నమ్మాళ్వార్ల తిరువతార స్థలము అప్పన్ సన్నిధి కలదు.

మార్గము: ఆళ్వార్ తిరునగరి నుండి 3 కి.మీ. తూర్పున తామ్రపర్ణీనది ఆవలియొడ్డున గలదు. ఒక సన్నిధి తామ్రపర్ణీ నదీతీరమున మరియొక సన్నిధి కాలువ సమీపమున గలవు.

పా. తిరున్దు వేదముమ్‌ వేళ్‌వియుమ్‌ తిరుమామక ళిరున్దామ్‌, మలి
    న్దిరున్దు వాழ் పొరువల్ వడకరై వణ్డులై విల్లిమజ్గలమ్‌;
    కరున్దడజ్కణ్ణి కై తొழுదవన్నాళ్ తుడజ్గియిన్నాడొఱుమ్‌;
    ఇరున్దిరున్దరవిన్ద లోచన వేన్ఱెన్ఱే వైన్ది రజ్గుమే.
          నమ్మాళ్వార్-తిరువాయిమొழி 6-5-8

                                            64