తిరుమంజనం గరుడసేవలు సేవింప తగినవి. శ్రీరంగములో వలె ఇచటను అరయర్ సేవ కలదు.
ఇచట స్వామి స్వయం వ్యక్తము. పెద్దతిరుమేనితో వేంచేసి యున్నారు. స్వామి శ్రీపాదములు భూమిలో నున్నవని ఐతిహ్యము.
ఇంద్రుడు పితరులను సేవింప నందున వారిచే శపింపబడి, ఈ స్థలమునకు వచ్చి ఆధినాథ పెరుమాళ్లను సేవించి శాపవిముక్తిని బొందెనని స్థలపురాణము.
"సర్వేశ్వరుని పరత్వమును తెలిసికొన లేక సంసారులు నశించి పోరాదు" అను ఔదార్యముతో ఆళ్వార్లు "ఒన్ఱుమ్ తేవుమ్" అను దశకమును ఉపదేశించి సర్వేశ్వరుడే సమస్త కారణభూతుడు అని పరత్త్వమును ప్రకటించి, అతడు మన కొరకే తిరుక్కురుగూర్ అను దివ్యదేశమున(తిరుక్కురు గూర్ అదనుళ్‌నిన్ఱ) వేంచేసియున్నారు. అని సర్వేశ్వరుని "పరత్త్వ సౌలభ్యములు" అనుగుణములను ప్రకటించిరి.
మార్గము: తిరునల్వేలి నుండి తిరుచ్చందూర్ రైలుమార్గం. ఆళ్వార్ తిరునగరిస్టేషన్ శ్రీవైకుంఠ స్టేషన్ నుండి 5 కి.మీ.
పా. ఒన్ఱున్తేవు ములగు ముయిరుమ్; మత్‌త్తుమ్ యాదుమిల్లా
అన్ఱు;వాన్ముగన్ఱన్నొడు తేవరులకోడు యిర్ పడైత్తాన్
కున్ఱమ్పోల్ మణిమాడ నీడు తిరుక్కురుగూరదనుళ్
నిన్ఱ వాదిప్పిరాన్ నిఱ్క మత్‌త్తై తై య్‌వమ్ నాడుదిరే||
పా' ఇలిజ్గత్తిట్ట పురాణత్తీరుమ్ శమణరుమ్ శాక్కియరుమ్
వలిన్దు వాదు శెయ్ వీర్గళుమ్ మற்றுమ్ నున్దెయ్‌వము మాగినిన్ఱాన్
మలిన్దు శెన్నెల్ కవరివీశుం తిరుక్కురుగూరదునుళ్
పొలిన్దు నిన్ఱ పిరాన్ కణ్ణిర్ ఒన్ఱుమ్పెయిల్లై పోత్తుమినే.
ఓడియోడి ప్పలపిఱప్పుమ్పిఱన్దు, మறறோర్‌తెయ్‌వమ్
పాడియాడిప్పణిన్దు పల్ పడికాల్ వ ழி యేఱి కాణ్డీర్
కూడివాన పరేత్తనిన్ఱ తిరుక్కురుగూరదనుళ్,
ఆడుపుట్కొడి యాది మూర్తి క్కడిమై పుగువదువే.
నమ్మాళ్వార్-తిరువాయిమొழி 4-10-1,5,7
63