42. తిరుక్కోట్టియూర్ 2 (గోష్ఠీపురము)
శ్లో|| శ్రీమద్దేవ సరోజినీ విలసితే గోష్టీపురే పాజ్ముఖ
స్త్వష్టాంగాఖ్య విమాన మధ్య నిలయ శ్శ్రీసౌమ్య నారాయణః |
ఆలింగన్ తిరుమామకళ్ పదయుతాం దేవీంతు నాట్య స్థితిః
కాదంబేంద్ర విలోచనాతిథివపు ర్విద్యోతతే సర్వదా ||
శ్లో|| భక్తిసార మహాయోగి పరకాల గదాంశజైః |
విష్ణుచిత్తేన మునినా మంగళాశాసనైః స్తుతః ||
వివ: సౌమ్య నారాయణన్ - తిరుమామకళ్ నాచ్చియార్ - దేవ పుష్కరిణి - అష్టాంగ విమానము - తూర్పు ముఖము - నిలుచున్న, కూర్చున్న నడుచుచున్న నాట్యమాడుచున్న సేవ. కదంబ మహర్షికి ఇంద్రునకు ప్రత్యక్షము. పూదత్తాళ్వార్, పేయాళ్వార్, తిరుమழிశై ఆళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించిన క్షేత్రము.
విశే: హిరణ్యుని భాధలను సహింప జాలని దేవతలు కదంబమునిని ప్రార్థింపగా హిరణ్యుడు రాలేని ఈ ప్రదేశమునందుండుడని వారిని నియమించెను. ఆ ప్రకారము దేవతలు గోష్ఠిగానున్న కారణమున గోష్ఠీపురమని పేరువచ్చెను.
ఇచ్చట సన్నిధి నాలుగు మిద్దెలుగా నుండును. ఇచట గల అష్టాంగ విమానము విశ్వకర్మచే నిర్మింపబడినది. ఉడయవర్ ఈ క్షేత్రములో వేంచేసియున్న తిరుక్కోట్టియూర్ నంబిగారి వద్దకు పదునెనిమిది పర్యాయములు వేంచేసి చరమ శ్లోకార్థమును (తిరుమంత్రార్థమని కొందరి అభిప్రాయము) సేవించి భక్తకోటికి అనుగ్రహించిన ప్రదేశము. ఇచ్చట. తిరుక్కోట్టియూర్ నంబిగారికి, ఉడయ వరులకు సన్నిధులు గలవు. గోపురముపై ఉడయవర్ గ్రామమునంతను చూచుచున్నట్లుందురు. తిరుక్కోట్టియూర్ నంబిగారి అవతార స్థలం. మేషం చిత్త తీర్థోత్సవము.
మార్గము: మధుర నుండి బస్‌లో తిరుప్పత్తూర్ చేరి అచట నుండి వేరు బస్‌లో 10 కి.మీ దూరమున ఈ క్షేత్రమును చేరవచ్చును.
పా. ఇన్ఱావఱికిన్ఱే నల్లేన్; ఇరు నిలత్తై
చ్చెన్ఱాజ్గళన్ద తిరువడియై-అన్ఱు
కరుక్కోట్టియు ట్కీడన్దుకై తొழுదేన్ కణ్డేన్
తిరుక్కోట్టి యైన్దై తిఱమ్.
పూదత్తాళ్వార్-ఇరండాం తిరువన్దాది 87 పా.
54