పుట:DivyaDesaPrakasika.djvu/106

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

అభివర్ణించినారు. ఈక్షేత్రస్వామికి కళ్ళழగర్ అను తిరునామము కలదు. నమ్మళ్వార్లు "శొ-ఱ్కవిగాళ్" అని తిరువాయి మొழிలో "నె-ముయిరుముళ్ కలన్దు" (మనస్సు నందును ప్రాణము నందును కలసిపోయి) అని సర్వేశ్వరుని "ఆశ్రిత వ్యామోహమనెడి గుణమును అభివర్ణించిరి. నమ్మాళ్వార్ల భక్తికి పరవశుడైన సర్వేశ్వరుడు ఆళ్వార్లను వీడలేక వారి తిరుమేని యందు మిక్కిలి ప్రీతిని చూపగా ఆళ్వార్లు "అయ్యో! సర్వేశ్వరుడు నన్ను ఈ దేహముతోనే పరమపదమునకు తీసికొని పోవునేమో! అట్లైన ఈ సంసారము నిత్యమగునే!" యని తలచి సర్వేశ్వరుని ప్రార్థించి ఈ దేహముపై మోహమును విడువమని ప్రార్థింపగా స్వామి యట్లేయని యంగీకరించెను. అపుడు ఆళ్వార్లు "ఆహా! ఏమి సర్వేశ్వరుని శీలగుణము, ఆశ్రిత వ్యామోహము" అని ఆశ్చర్యపడి ఆ ఆశ్రిత వ్యామోహమును "శొ-ల్‌కవిగాళ్" అను దశకమున ప్రకటించుచున్నారు.

ఈ సన్నిధి చాలా పెద్దది. దీనికి అழగర్ కోట యని పేరు. సన్నిధికి ఉత్తరముగా కొండపై నూపుర గంగ కలదు. సన్నిధి గోపురద్వారమున 18వ పడి గట్టులో "కరుప్పణన్" అను వారు సన్నిధికి కావలిగా నుందురు. సన్నిధి తాళము వేసిన పిమ్మట ఆ తాళములను వీరి సన్నిధిలో ఉంచుదురట.

బ్రహ్మోత్సవ సమయంలో చక్రత్తాళ్వార్ మాత్రమే గోపుర ద్వారము నుండి వేంచేయుదురు. పెరుమాళ్లు ప్రక్కనున్న ద్వారము నుండి వేంచేతురు.

మేషం పౌర్ణమినాడు ఏటి ఉత్సవమునకు పెరుమాళ్లు వేంచేయగా తాయార్లకు కోపము వచ్చినదట. ఆకారణమున నాడు మొదలు బ్రహ్మోత్సవము వరకు సన్నిధి ప్రాకారములో గల ఒక మండపములో వేంచేసి తిరువారాదన స్వీకరింతురు.

ఉత్సవములు:- మేషమాసములో పౌర్ణమినాడు మధురలో గల వైగైనదిలో ఏటి ఉత్సవము జరుగును. ఈక్షేత్రస్వామి విషయమై శ్రీకూరత్తాళ్వాన్ సుందరబాహుస్తవముననుగ్రహించిరి.

కర్కాటక మాసములో బ్రహ్మోత్సవము జరుగును. పలు సత్రములు సన్నిధి సమీపములో కలవు. సన్నిధిలో ప్రసాదము లభించును. అన్ని వసతులు గల క్షేత్రము.

మార్గము:- మధురకు 15 కి.మీ దూరము.

పా. కిళరొళి యిళమై కెడువదన్ మున్నమ్‌,
    వళరొళి మయోన్ మరువియ కోయిల్,
    వళరిళమ్‌ పొழிల్ శూழ் మాలిరు-లై
    తళర్విలరాగిల్ శార్వదు శదిరే.
             నమ్మాళ్వారు-తిరువాయి మొழி 2-10-1

                   52