41. తిరుమాలిరుం శోలై మలై 1 (మధుర 20 కి.మీ)
(అழగర్ కోయిల్)శ్లో|| శ్రీమద్వనాద్రి పథ నూపుర నిమ్నగాంతే
దేశేస్థితో వృషభ పర్వత చందనాఢ్యే |
ధర్మేక్షితస్తు మలయధ్వజ పాండ్య దృష్టః
ప్రాగాసనో లసతి సుందరబాహు నాథః ||
శ్లో|| సోమసుందర విమాన మథ్యగః సుందరోప పద వల్లికాయుతః |
విష్ణుచిత్త కలిజిత్ పరాంకుశైః గోదయా మణి మహర్షిణాస్తుతః ||
వివ: సుందర బాహు పెరుమాళ్ - అழగర్ (మాలాలంకారర్) - సుందరవల్లి తాయార్, కళ్యాణవల్లి తాయార్, నూపురగంగ (శిలమ్బాఱు) - సోమసుందర విమానము - వృషభగిరి - చందన వృక్షము - తూర్పు ముఖము - నిలుచున్న సేవ - ధర్మదేవతకు మలయధ్వజ పాండ్యరాజునకు ప్రత్యక్షము - పూదత్తాళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, ఆణ్డాళ్, తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
ఈ క్షేత్రమునము దక్షిణ తిరుపతి యనియు, వనగిరి యనియు పేరు. ఇచట మూలవర్, ఉత్సవర్ కూడ పంచాయుధములతో వేంచేసి యుందురు. మూలవర్‌కు వైకుంఠ నాథన్, పరమ స్వామియను తిరునామములు కలవు. స్వామి ప్రయోగ చక్రహస్తులై వేంచేసియున్నారు.
ఈక్షేత్రస్వామి విషయమై ఆణ్డాల్ "నాఱు నఱుమ్బొழிల్" అను పాశురమున స్వామికి నూరు గంగాళముల అక్కారవడిశల్(పాయసాన్నము), నూరు గిన్నెలతో వెన్న ఆరగింపుచేతునని మాట యిచ్చినారు.
పిమ్మట భగవద్రామానుజులు అవతరించి ఆణ్డాల్ శ్రీసూక్తి సఫలమగునట్లుగా నూరు గంగాళముల అక్కారపడిశల్ , వెన్న ఆరగింపుచేసి పిమ్మట ఈ విషయమును ఆండాళ్ సన్నిధిలో విజ్ఞాపన చేసిరి. అంతవారు సంతుష్టాంత రంగులై ఉడయవరులను జూచి "ఎన్ కోయిల్ అణ్ణనే" అని పిలిచి ఆదరించి గౌరవించిరట. అది మొదలు ఉడయవర్లకు "గోదాగ్రజ:" అనియు "కోయిల్ అణ్ణన్" అనియు తిరునామములు ఏర్పడినవి. ఇచట ఆణ్డాళ్ "వీత్తిరున్ద తిరుక్కోలముతో(కూర్చున్న భంగిమ) వేంచేసియున్నారు.
ఈక్షేత్రమునకు "మయల్ మిగు పొழிల్"(తిరువాయ్ మొழி 2-10-3)(దట్టమై తోటలుగల దివ్యదేశము) అను విశిష్టమైన తిరునామము కలదు. తిరుమంగై ఆళ్వార్ ఈక్షేత్రస్వామిని "తెన్నానై" (తెఱ్కే ఆనై) దక్షిణ దిగ్గజముగా