Jump to content

పుట:DivyaDesaPrakasika.djvu/101

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

39. తిరువెళ్ళక్కుళమ్‌ 39 (అణ్ణన్ కోయిల్)

శ్లో|| పురేతు వెళ్ళక్కొళ మిత్యభిశ్రుతే తన్నామ తీర్థే సుర దిజ్ముఖ స్థితిః |
    నారాయణాఖ్యో వరతత్త్వబోధ వైమానమాసాద్య విరాజతే హి ||

శ్లో|| ఇక్ష్వాకు శ్వేత రాజోగ్ర ప్రత్యక్షత్వ ముపాగతః |
    పూమార్ తిరుమకళ్ దేవీ మాశ్రితః కలిహస్తుతః ||

వివ: నారాయణన్ - అణ్ణన్ పెరుమాళ్ - పూవార్ తిరుమగళ్ నాచ్చియార్ - వెళ్లక్కొళమ్‌ పుష్కరిణి - తత్త్వబోధ విమానము - తూర్పుముఖము - నిలుచున్న సేవ - ఇక్ష్వాకు వంశీయుడైన శ్వేతుకేతు మహారాజునకు, పరమ శివునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.

విశే: తిరుమంగై ఆళ్వార్గ దేవిమార్లగు (భార్య) కుముదవల్లి నాచ్చియార్ ఈ తిరువెళ్లక్కొళ తీర్థమునందే అవతరించిరి.

మార్గము: కీழ்చాలైకు (తిరుత్తేవనార్ తొగైకు) పశ్చిమంగా 1 కి.మీ. దూరము. "అణ్ణన్ కోయిల్ అనియే చెప్పాలి." వసతులు లేవు.

పా|| కణ్ణార్ కడల్‌పోల్ తిరుమేని కరియాయ్ |
    నణ్ణార్ మునైవెన్ఱి కొళ్వార్ మన్ను నాజ్గూర్
    తిణ్ణార్ మదిళ్‌శూழ் తిరువెళ్లక్కుళత్తుళ్ |
    అణ్ణా; అడయే నిడరైక్కళైయాయే.

పా|| వేడార్ తిరువేజ్గడం మేయవిళక్కే; |
    నాడార్ పుగழ் వేదియర్ మన్నియ జాజ్గూర్
    శేడార్ పొழிల్‌ శూழ் తిరువెళ్ళక్కుళత్తాయ్ |
    పాడా పరువేన్ వినై యాయినపొత్తి.
             తిరుమంగై ఆళ్వార్ - పెరియ తిరుమొழி 4-7-1.5.


సంసార బీజము

మంచిమాట

ముముక్షువునకు సంసారబీజము నశింపవలెను. పేడపురుగు పేడలో తిరుగుచున్నను ఆపేడ దానికి అంటనట్లుగా ముముక్షువైనవాడు సంసారములో నుండినను సంసారముతో సంబంధము లేకుండ నుండవలెను. అట్లున్నచో సంసారబీజము నశించును. అట్టివారు జనకచక్రవర్తి వంటివారు.

                                           49