38. తిరుక్కావళంబాడి 38 (తిరునాంగూర్ తిరుపతి)
శ్లో|| పృధు పుష్ప సరో రమ్యే కావళంబాడి పట్టణే |
స్వయంభు వర వైమాన స్థాయీం శెంగమలాభిధామ్ ||
శ్లో|| నాయకీ మాశ్రితశ్శ్రీవ న్ ప్రాజ్ముఖో రుద్ర సేవితః |
గోపాలకృష్ణ భగవాన్ రాజతే కలిజిన్నుతః ||
వివ: గోపాలకృష్ణన్ - శెంగమలవల్లి - మదనగర్ మంగై నాచ్చియార్ - తడమలర్ పొయిగై పుష్కరిణి - స్వయంభూ విమానము - తూర్పుముఖము - నిలుచున్న సేవ - రుద్రునకు ప్రత్యక్షము - తిరుమంగై ఆళ్వార్ కీర్తించినది.
విశే: తిరుమంగై ఆళ్వార్ తిరు అవతార స్థలమైన తిరుక్కుఱైయలూర్; తదీయారాధన చేసిన ప్రదేశమగు మంగై మఠము సమీపముననే కలవు. మంగ మఠము నందు శ్రీ వీర నరసింహస్వామి సన్నిధి కలదు.
అర్చకులు కీళ్ చాలైలో నుందురు. వారిని తోడ్కొని వెళ్ళియే సేవింపవలసి యున్నది.
మార్గము: తిరుత్తేవనార్‌తొగైకు(కీழ்చాలై) 1 కి.మీ. దూరములో ఈ క్షేత్రము కలదు.
పా|| తావళన్దులగమற்றுమ్ తడమలర్ ప్పొయ్‌గై పుక్కు
నావళ నవిన్ఱజ్గేత్త నాగత్తిన్ నడుక్కమ్ తీర్తాయ్మ
మావళమ్ పెరుగి మన్నుమఱైయవర్ వాழమ్, నాజ్గైక్
కావళమ్బాడిమేయ కణ్ణనే కళైగఱియే.
పా|| శన్దమాయ్ చ్చమయమాగి చ్చమయవైమ్బూదమాగి;
అన్దమాయాదియాగి యఱుమఱైయలైయు మానాయ్
మన్దమార్ పొழிల్‌కడోఱుమ్ మడమయిలాలు నాజ్గై
కాన్దనూర్ కావళన్దణ్ పాడియాయ్ కళైగణీయే
తిరుమంగై యాళ్వార్- పెరియ తిరుమొழி 4-6-9
భగవత్ర్పాప్తి
మంచిమాటమూడు జన్మలు(హిరణ్యకశిప, రావణ, శిశుపాల) భగవంతునితో విరోధించి అవతారములు చేసిన శిశుపాలుడు చివరకు భగవంతుని బొందినాడు గదా! అనాది కాలముగా అనేక జన్మ పరంపరలలో భగవంతునితో విరోధించి అపచారము చేయుచున్న మనము సర్వేశ్వరుని పొందకపోదుమా!
"కురుగూరునంబిగారు""
48