పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

లవారికి వెన్నతోఁ బెట్టిన విద్యగాఁ బరిచితమయి యుండుట యెల్లరు నెఱిఁగిన విషయమే.

ఇర్వదేండ్లకు ముందు వినుకొండప్రాంతగ్రామవాస్తవ్యులు కలియుగార్జునబిరుదాంకులు అప్పారాయాభిధాను లొకరు ధనుర్విద్యలో నద్భుతనైపుణ్యము ప్రదర్శించుట నే నెఱుఁగుదును. నేడును వారు తద్విద్యానివుణులై నెగడుచున్నారట! తాలింఖానాలు వస్తాదుల కుస్తీపట్లు నేఁడును పలుచోట్ల సాగుచున్నవి. సంస్కృతాంధ్రగ్రంథములఁ జదివి నేర్చుట తగ్గినదేమో కాని వానిలో విషయములు తొలుతఁ బ్రాకృతమున నిటీవల ఉర్దూలో పారిభాషికపదములతో వెలసి వ్యవహారరూఢి గనుట ఆయాగ్రంథార్థము లనుభూతిలో నన్వితములయి నిన్నమొన్నటిదాఁక ననేకుల కందుబాటులో నుండుట దెలియవచ్చుచునే యున్నది.

ప్రస్తుతమగు ధనుర్విద్యావిలాసవిషయములు ధనుర్విద్యావిశారదుఁడగు తురకపండితుని (మహమ్మదజాఫర్ గురుని) యుపదేశముచొప్పున నేర్చి గ్రంథరచనాప్రేరకుఁడు, రేపల్లెఱేఁడు తిరుపతిరాయప్రభుఁడు వివరించుచుండగా విని వాని పద్యకావ్యరూపమున కృష్ణమాచార్యుఁ డను కవి రచించెనట! పాశ్చాత్యయుద్ధశాస్త్రశిక్షలు పెంపొందిన పిదప తుపాకులు ఫిరంగులు మొదలగునవి వెలయుటచే ధనుర్విద్య కంతగాఁ బ్రాముఖ్యము లేదయ్యెను. తుపాకులు మొదలగు నాయుధతంత్రములుగూడ బాంబులు, విమానములు, సబ్‌మరైనులు, మైనులు, రాడార్లు, ఆటంబాంబులు ప్రబలిన తర్వాత వెనుకఁబడఁజొచ్చినవి గదా! నిజముగా సత్యదయాజ్ఞానధీరుల యాయుధమగు నహింసాప్రయోగము బలయునేని ఆటంబాంబులదాఁకను బెరిగిన యుద్ధతంత్ర మెల్ల నిరర్థకమే కాఁగలదు.

సృష్ట్యాదినుండి నేటిదాఁక వీరాధివీరు లనిపించుకొన్న మహాపురుషుల యుద్ధతంత్రము లెల్ల గంధివీరుని ధీరతావీరతలముందు నిలువనేరక నిర్వీర్యములే యయినవి గదా, ప్రపంచము నందలి హింసా