పుట:Dhanurvidyaa vilaasamu (1950).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక


ఆంధ్రదేశమున నధీశ్వరులై వెలసినవారు ప్రాచీనులు నర్వాచీనులును ధనుర్విద్యలో నద్భుతప్రజ్ఞతో నారితేరి మగలమగలై గండరగండండ్రై సమరనిశ్శంకులై సంగరకిరీటులై యుండి రనుట చరిత్రపరిశోధకులు చక్కగా నెఱిఁగినవిషయమే.

అంతకుఁ బూర్వపువారివార్త లట్లుండగా చరిత్రసుపరిజ్ఞాతులయినవారు సాతవాహనులు, ఇక్ష్వాకులు, సాలంకాయనులు, విష్ణుకుండినులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు (వారిసేనానులు డెబ్బదేడు గోత్రాలవారు) వెలమవారు, రెడ్డివారు, కమ్మవారు, బలిఁజెవారు, కోటవారు, సాగివారు, పూసపాటివారు, వత్సవాయివారు, మందపాటివారు, తెలుగుచోళులు, వెలనాటిచోళులు, విద్యానగరాధీశులు, సాళ్వవారు, దాట్లవారు, మట్లవారు, గజపతులు, జగపతులు, తంజావూరు, మధుర, పుదుకోట, నాయకులు, నిటీవలివా రనేకులు జమీనుదార్లు నింక నెందఱెందఱో

కదనమె బొమ్మరిల్లు చెలికత్తెలు వీరజయాంగనామణుల్!
మదకరిమస్తకుంభములు మాటికి దొంతులు సంగరస్థలిన్
గుదిగొని పడ్డరాహుతుల క్రొవ్వులు గుజ్జనఁగూళ్లు బాపురే!

అన్న ప్రశస్తి గన్నవారే, వా రట్టివా రగుటకు గట్టిగా ధనుశ్శాస్త్రమున జితశ్రములగుట ముఖ్యహేతువు.

ఆయామహీపాలుర యేల్బళ్లలో ధనుర్విద్యాభ్యాసరంగములు చాలఁగా వెలసియుండెడి వనుటను ప్రాచీనగ్రంథములు ప్రఖ్యాతపఱచుచున్నవి. నేఁటికిని ధనుర్విద్య యాటవికులగు కోయ చెంచు సవరాది జాతు