పుట:Delhi-Darbaru.pdf/406

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ జార్జి పట్టాభి షేకము.

381


ఫిరంగుల మోతనిలచుట తోడనే ఆపనికయి నియోగిం పఁబడియుండిన యుద్యోగస్థుఁడొకఁడు చక్రవర్తి గారి యనుమతిఁ బడసి దర్బారు ప్రారంభ మయ్యెనని తెలియఁ జేసెను. జయజయ ధ్వానములు చెలంగె. గాయక బృందముల ఆరావము లాగుటయే యాలస్యముగ మనజార్జిసార్వభౌముఁడు ఈ క్రింది వాక్యములఁ బల్కెను.“ నేను నేఁడు మీయందఱు మధ్యమునందు నుండుట కెంతయు సంతసించుచున్నాఁడను. ఈసంవత్సరము నేనును చక్రవర్తినియు ననేకాను స్థానములయందు నిమగ్ను లమయి యున్నందున సంతోషకరమగు విశేష పరిశ్రమచేయవలసి వచ్చి, నది. మేము మున్ను ఈ దేశమునకు వచ్చినప్పుడు మామనముల నెలకొని మమ్ముల కృతజ్ఞులం జేసిన సువిషయజ్ఞానము వ్యవధి యెక్కుడుగ లేకున్నను దూరము మిక్కుటమే యైనను మమ్మును మరల నీభూమికి రాఁబురికొల్పెను. . కావున మే మే దేశమును ప్రేమింప నేర్చియుంటిమో ఆదేశమగు నిచ్చట సప్పటింబలె స్వగృహసౌఖ్య మబ్బఁగలదను సంపూర్ణాశ 3 బయలు దేరి వచ్చినారము. పరమాతుని కృపామహిమచే గడ చిన జూన్. మాసము 22 వ తేదీ మావంశమునకుఁ బరంపరగ నచ్చుచుండు కిరీటము ప్రాచీనాచారముల ననుసరించియు నుచిత పద్ధతులం 'బట్టియు ' వెర్టుమినిస్టరు ఆబి' యందునామౌ దల పై నిడఁబడియె. అసమాచారమును నేను స్వయముగ మిగా