పుట:Delhi-Darbaru.pdf/357

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మంత్రు లేరాజులు.

331


అతని సై న్యములు దేవనహళ్లియను కోటను ముట్ట డించుచుండిన కాలమున హైదరు దన ధైర్యము చేతను సాహ సము చేతను అతనిని మెప్పించి కొంత సైన్యమునకు నాయకుఁ డయ్యెను. ఆపదమున నుండి ఆంగ్లేయులకును ఫ్రెంచివారి కిని నగుచుండిన యల్లకల్లోలములలోఁ దన బలమును, వృద్ధి పఱచుకోనఁ జొచ్చెను. మైసూరు దళవాయి*[1]చే తిరుచినాపల్లి కడ మహమ్మదాలీకి సాహాయ్యర్థము తీసికొని పోఁబడినప్పుడు హైదరు మహా సామర్థ్యము చూపి దిండిగల్లుకు లీజుదారుగ నేమింపఁబడెను. తిరుచినాపల్లి ముట్టడినుండి దళవాయి నంజు రాజు మైసూరునకువచ్చి చేరెను. అప్పటికి మైసూరునందు దళవాయి పై తిరుగు బాటు నకు సర్వ విషయములును సిద్ధపడి యుండెను. దేవ రాజు ఉద్యోగము వదలుకొని శాంతిమై కాల ము గడప నేగియుండెను.

నంజ రాజు దుర్భరమగు గర్వముతో రాజ్య కార్య ముల నడపుచుండుటవలన రాజున కాతని యెడ నసూయ పుట్టి యుండె. కావున రాచమందిరము వారందఱును జేరి దళవాయిని వెడలఁగొట్టి ప్రయత్నము లుపక్రమించి యుం డిరి. వారు దమకు సాయము కొఱకు 'హైదరాలీని రమ్మని వేఁడిరి. అతఁడు నంజరాజును లోఁబజచుకొని కొంతకాల మతఁడు. తౌజ్౽[2] దీసికొని నిరుద్యోగతనుండునట్లు చేసెను. ఇట్లు

+

  1. మంత్రి సంజ రాజు
  2. పిచిక్ అని యము.