పుట:Delhi-Darbaru.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

206

హైదరాబాదు సంస్థానము.


చేయుదుననియు - ఆంగ్లేయ, ప్రభుత్వమునకు భక్తిచూపెద ననియు వాగ్దానము సేయు చున్నాఁడ” నని నుడి వెను. ఇతఁడు గడచిన పట్టాభి షేకమ హోత్సవ సమయమున ఢిల్లీ కరిగి యచ్చటి సామంత ప్రభుసభ నలంకరించి చక్రవర్తిగారిచే మొట్ట మొదట సన్మానమందెను.

తండ్రిగారి పరిశ్రమవలన ' రాజ్యాంగ శాఖలన్ని యుఁ జక్కఁగఁ దీర్చఁబడిన స్థితిలో నితఁడు రాజ్యమునకు వచ్చియు న్నాఁడు. ఇప్పుడు హైదరాబాదు నందు ఆంగ్లేయ మండల ములందు వలెనే ముఖ్యమంత్రి అధికారము క్రింద మఱియార్గు రు మంత్రులతోఁ గూడిన రాజ్య కార్య నిర్వాహక సంఘమును (Executive Council) ఔద్యోగికా నౌద్యోగిక (Official & non-official.) సభ్యులతో గూడిన శాసననిర్మాణ సభయును గలవు. తదను గుణముగనే ఇతర రాజ్యాంగ శాఖలును సంస్క రింపఁ బడి యున్నవి. ఉత్తమన్యాయ స్థాన మొండు నెలకొల్పఁ బడియున్నది. విద్యాలయములును స్థాపింపఁ బడియున్న వి. వీని నన్నింటి నభివృద్ధిపఱతిచి, జాగరూకుఁడై మెలఁగి - ప్రజాక్షేమ మునకై పాటుపడి తండ్రిగారి కంటె నెక్కుడనిపించు కొనుటకీ 'నైజామునకు దైవము బుద్ధిబలంబుల నొసంగుగాక !