పుట:Delhi-Darbaru.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'182

హైదరాబాదు సంస్థానము.


1857 న సువత్సరపుఁ దిరుగుబాటు నందుఁ గలిసికొనెను. దాని వలన షోలాపురమును సాధించుటకు మన సైన్యములు వెడల వలసి వచ్చెను. అతఁడోడింపఁబడిన మీఁదట అతని రాజ్యము మన స్వాధీనమయ్యెను. అతనికి నైజాము యజమానుఁడై నందున ఆతని తిరుగుబాటు మన యెడల నెంతయే నైజాము నెడలను సంత యె. ఏదెట్లున్నను తిరుగు బాటునకుఁ బూర్వము షోలాపురము వలన మనకు నేలాటి ఆదాయమును ఉండినదిగాదు. నైజా ము మనకు సహాయుడుగ నుండినందున అతని సామంతుని దయిన పోలాపురమును మన మాక్రమించుకొనుట కేలాటి న్యాయాధారమును ఉండియుండదు.

"నైజాముగారు మన యెడల గనుపఱిచిన విశేషభక్తిని మెచ్చుకొనుచు 1860 వ సంనత్సరమున మనమతనికి నిచ్చిన బహుమానముల 1[1]నిట్లు విమర్శించి పరిశీలించినచో మనమాదా ర్యము సూపితిమని డంబము చెప్పికొన వీలు లేదు. హైదరా బాదు సంస్థానమునకు మొదట స్వంతములయియుండిన వానిని మనము మరలనిచ్చితిమి." .............................................................................................

1.

  1. లక్ష రూపాయిల పిలువగల వస్తువులు బహుమానము. లియ్యం 'బడెనని ముందు వ్రాయఁబడెను. వానికిఁ బ్రతిబహుమానములుగ రెసిడెంటు నకును ఇత రాధికారులకును నైజాము 90,000 రూప్యములు వెలగల ఆభరణ నిచ్చెనని ఫ్రేజరు వ్రాయుచున్నాడు