పుట:Delhi-Darbaru.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రిబ్బిల్ అభిప్రాయములు,

181


నైజామునకు మనము లెక్కలు చూపవలసినవారమే యైయుండి యు, ఆసీమల ఆదాయవ్యయ పట్టికలమాటయె ఎత్తికొని యుం డ లేదు. 1860 న సంవత్సరమున రాయచూరుమండలము నైజా ము సైన్యవ్యయములకయి. అవసరముగాదని మనమంగీకరించి యేయుంటిమి. కావున నంతకుఁ బూర్వము గొన్ని సంవత్సరము లు రాయచూరు మండలా దాయము (సుమారిరువదిలక్షలరూ పాయిలు మనచేతులలో నుండిపోవుటవలన నీఏబదిలక్షలురూ పాయిల ఋణమునందెక్కుడు భాగము తీరిపోయి యుం డెనని యే చెప్పమెప్పును. ఇంతమాత్రమే కాదు. హైదరాబాదు సంస్థా నమువారు మనకు గోదావరీతీరమునఁ గొన్ని తాలూకా లిచ్చె దమని యంగీకరించిరి. వానినుండి సంవత్సరాదాయము రెండు మూఁడులక్షలు.1[1].. ఇది నూటికి నాల్గువంతున వడ్డీయని యెన్ను కొనినచో నట్లయ్యఁబడిన తాలూకాలే పూర్ణ ఋణమును దీర్పఁ గల్గినవి

“మనము ఇచ్చిన మఱియొక వరమేమన హైదరాబాదుకు షోలాపూర సంస్థానమును వశపఱచుట. షోలాపురము హైద రాబాదుకు లోఁబడియుండిన ఒక చిన్న సంస్థానము. దానిరాజు

1.

  1. ఈ భూభాగమునుండి వసూలగు పన్ను మొత్తము సంవత్సరమునకు రు 8,20, 888_13_5 అని 1860–61 సంగత్సరపు బీరారుమండలపు రిపోర్టులో వ్రాయఁబడినది. గ్రిబ్బిల్ కర్చులు దీసివేసి నికరాదాయమును లెక్కించిరని ఊహింపగలసియున్నది.