పుట:Delhi-Darbaru.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విక్టోరి యా మరణ ము.

79


గుఱించి : యితఁడు దరువాత నొక సభయందు " మహాజను లారా! ఇట్టి సంగతుల నెల్ల మనమాపరమాత్మిని చేతిలోనివా రమే” యని హ్రస్వరీతిని పలికిఁ దనభావమును వెల్ల డించెను 1889 న సంవత్సరమున నే గ్లాడుస్టను మహానుభావునికి దేహ ము స్వస్థతగప్పి లోకమునకుఁ గొంతవిచారము గలిగెను. అప్పుడు జార్జ్ ప్రభువును మేరీ ప్రభ్వియు నతనియెడ సానుభూతి గనుపఱచిరి. కొలఁది కాలములో గ్లాడుస్టను పరలోక ప్రాప్తి , జెందెను. అతని భార్యయు -1900 జూన్ ' మాసములో మగనిఁ గలుసుకొన నేగెను. గ్లాడ్ స్టను సమాధి సమయమున మన ప్రభు వును నతని తండ్రియు శవము పయిఁబఱచు వస్త్రమునుమోసి కొని యాలో కో త్తరునియెడఁ దమకుఁ గల గౌరవ ప్రేమలఁ గనుపఱచిరి. అతని భార్య గతించిన ప్పుడును మన ప్రభువును ప్రభ్వియు దమ సానుభూతిం దెలిపిరి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచి తన సౌమనస్యము వలన నానా దేశీయ ప్రజల నలరఁ జేసి, బూట కపు బిరుదులు మానవుల పరస్పర సామ్యమును బ్రక టించుఁ దనవంటి మహామహునకు రుచింపనని దనంతవచ్చి చేరిన ప్రభు వు పదమును దిరస్కరించి చాటి, మానవ నామమున కర్హత నిచ్చు నుపకరణము సత్కార్య దీక్షు యే యని తన జీవనము వలనఁ బ్రదర్శించి, యింగ్లాండు రాష్ట్రమునకును విక్టోరియా మహారా జి కిని అఖండ యశస్సును సంపాదించి పెట్టి, లోక మెల్లను . హాహారావములు సెలంగ నస్తమించిన రాజనీతి పారంగతుఁ .