పుట:Dashavathara-Charitramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

గుందనపుఁదళ్కు నెఱపూఁతగంద మమరఁ, దగటుఁ చెఱుగులఁ జెంగావి సొగసుఁ జూపఁ
జిల్కసామ్రాణి తేజివజీరుఁ గేరు, కృష్ణమంత్రీంద్రుచెలువు వర్ణింపఁ దరమె.

72

షష్ఠ్యంతములు

క.

ఈదృశగుణహారునకును, దాదృశనయమార్గసంతతవిహరునకున్
స్త్రీదృఙ్నవమారునకున్, సౌదృగ్జనవినుతభక్త్యజకుమారునకున్.

73


క.

ధీరునకుఁ గీర్తిఘటజల, ధీరునకు భుజప్రతాపధృతసర్వవిరో
ధీరునకుఁ బాలితాఖిల, ధీరునకు సుధారసోన్నతీధీరునకున్.

74


క.

సకలకలాపావనునకు, సుకవికలాపావనునకు శ్రుతిచాతుర్య
ప్రకలితధీరక్షణునకుఁ, [1]బ్రకటితధీరక్షణునకుఁ బద్మాక్షునకున్.

75


క.

ధృతిబందీకృతనానా, క్షితిధరశంకావిధాయిశృంఖలితమదో
న్నతగజపూర్ణాంగణునకు, రతిరాజసమానరూపరమ్యగుణునకున్.

76


క.

చరణానతశరణాగత, భరణాతతవత్సలత్వపాత్రునకు సదా
భరణాయితకరుణాయుత, తరుణాయత విమలకమలదళనేత్రునకున్.

77


క.

మగదలకులధన్యునకు, జగదేకవదాన్యునకు ద్విషద్ధరణీభృ
ద్దిగధిపమూర్ధన్యునకున్, జగతీమాన్యునకు వినుతసౌజన్యునకున్.

78


క.

భద్రశ్రీమిహికాదిమ, భద్రశ్రీవరకరాబ్దఫణిప బిడౌజో
భద్రశ్రీకంధరబల, భద్రశ్రీనిధియశోవిభవభద్రునకున్.

79


క.

ఇంద్రశిలాతంద్రకళా, సాంద్రవిలాసాఢ్యకనకసౌధోన్నతికిం
జంద్రమణీరుంద్రఘృణీ, చంద్రతృణీకరణచంద్రశాలాతతికిన్.

80


క.

మంత్రి యుగంధరునకుఁ బర, [2]మంత్రికృతాంతునకు దివిజమంత్రినిభునకున్
మంత్రిశరచ్చంద్రునకు, న్మంత్రిమృగేంద్రునకుఁ గృష్ణమంత్రీంద్రునకున్.

81


వ.

అభ్యుదయపరంపరాభివృద్ధిగా నేరచియింపంబూనిన రసికజనకంఠాభరణ శ్రీకృష్ణదశావతారచరిత్రమహాప్రబంధపవిత్రముక్తాదామంబునకు విచిత్రకథాసూత్రం బెట్టిదనిన.

82
  1. అకలంకయశోవిరాజతారాధ్యునకున్
  2. మంత్రివిభాళునకు