పుట:Dashavathara-Charitramu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

సోముఁడు గావున గౌరీ, భామినిఁ జేకొనియె ననుచుఁ బ్రజ లెన్నఁగ నా
సోమామాత్యశిఖామణి, ప్రేమంబున గౌరమాంబఁ బెండిలి యయ్యెన్.

23


క.

గౌరమ సుగుణావళి బా, గౌరమ మహిమహిళ నగుక్షమాన్విత యయ్యున్
గౌరమనోహరకీర్తులు, గౌరమ హసియింపఁగా జగన్నుతలీలన్.

24


తే.

గౌరియందుఁ గుమారునిఁ గనియె సోముఁ, డౌర యచ్చెరు వని జను లనఁగ సోమ
మంత్రి గౌరమయందుఁ గుమారుఁ గనియెఁ, దిమ్మనామాత్యచంద్రు సుధీఫణీంద్రు.

25


శా.

ఏమే జాన్హవి యేమి రాఘవ యదేమే వైరి నెన్నేవు నీ
వేమీ నానవతిం [1]గణించెద వదేమీ నీవు కాళిందివా
యౌ మే నేటికిఁ దెల్లనాయె జలధీంద్రా తిమ్మమంత్రీశ్వర
శ్రీమత్కీర్తులు గ్రమ్మఁగా ననిన నాశ్లేషించు హర్షంబునన్.

26


క.

తిమ్మనమంత్రీంద్రుఁడు ల, క్ష్మమ్మను వరియించి కనియె నాశ్రితజలరు
ట్సమ్మోదనచాతుర్యర, విమ్మాన్యదయాప్రచారు వేంకటధీరున్.

27


చ.

మగదలతిమ్మధీరునికుమారుని వేంకటమంత్రి నెన్నఁ బ
న్నగపతి శక్తుఁ డౌనె తదనారతకల్పితదానవాహినీ
లగనసమృద్ధసస్యఫలలాభములన్ సకలప్రజావ్రజం
బగణితభోగ మొంద [2]వృథలౌఁ జెఱుపు ల్దొరువు ల్ప్రవర్షముల్.

28


సీ.

అగ్రహారంబుల నలరించె ధారుణీరమణీకుచాగ్రహారములు గాఁగ
దానము లొనరించె ధరణి నిర్జరభూరిదారిద్ర్యహరణ[3]నిదానములుగ
నర్థులఁ బోషించె ససమానచీనిచీనాంబరదానకృతార్థులుగను
బంధుల రక్షించే సింధుబంధుసుతాదృగంతబంధుకృపాబంధులుగను


తే.

మంత్రిమాత్రుండె మానినీమానమథన, మదనసమమూర్తి హరిదంతమధురకీర్తి
[4]వినతనృపపాళి మర్దితవిమతపాళి, మహితరుచిహేళి వేంకటామాత్యమౌళి.

29


క.

పద్మాధరణుల నేలిన, పద్మాక్షునిలీల [5]వెలసె భాసురతేజ
స్పద్మము వేంకటధీమణి, పద్మాంబిక వేంకటాంబ భార్యలు గాఁగన్.

30


తే.

ఔర వేంకటవిభుద్వితీయద్వితీయ, యద్వితీయగుణస్ఫూర్తి నతిశయించి
యద్వితీయేందు హసియించు నళికరేఖ, వశమె యావేంకటాంబచెల్వంబుఁ బొగడ.

31


సీ.

విబుధేంద్రమాతయై ప్రబలె నాయదితి దాఁ గశ్యపుసంగతి [6]గాంచు టెట్టు
లతిసువర్ణాఢ్యత నందె నాభారతిపతి హయంబులఁ బట్టఁ బనుపు టెట్లు
స్నేహంబు గలిగె నాక్షితిభృత్కుమారి యీశ్వరుతల జడగట్ట నరయు టెట్లు
విభవంబుఁ జెందె నాఋభురాజగేహిని గనుమూయ నెడలేక మనుట యెట్లు

  1. గణించితివి యేమీ
  2. వితతా
  3. విధాన
  4. విజిత
  5. మెఱసె
  6. 'గాంచుడెట్లు; పనుపుడెట్లు' అనియు కలదు.