పుట:Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

53

మీరు మిగిలిన పనిని కొనసాగించవలయును. మీ స్థానములు సైతము కారాగారములలో మావంటి మీసోదరీలకును, సోదరులకును ప్రక్కననే అమర్చఁ బడియున్నవని మరవకుఁడు. బానిసదేశములో స్వేచ్ఛానిరోధమును బొందుటకన్న నిజమగు కారాగారబద్ధులగుటయే గౌరవము. ప్రభుత్వ విద్యాలయములలో విద్యార్థులుచేరక వదలి స్వాతంత్ర్యసంరంభమునకు పూను కొనవలయును ఇదియే మావిన్నపము. ఈసంరంభమున జయించిన స్వరాజ్యప్రాప్తి సిద్ధము. లేదా, ఈ దేహములను ఈసమరములో అర్పించుట సిద్ధము. రెండును దివ్యములే మాకు. ఈబానిసతన మిక కూడదు. చావో, బ్రతుకో తేలవలయును. పోలీసులు తమపనులకు రాజీనామాల నియ్యవలయునని మేము కోరెదము. ఈపాడు నిర్భంధములను తమ దేశ సేవాపరాయణుల విషయములో ప్రయోగించి జీవించుటకన్న అన్నములేక మాడిచచ్చుట శ్రేయస్కరము అని వారు గుఱ్తింతురు గాక!"

ఇట్లు దేశబంధువై చిత్తరజనుఁడు వంగ దేశమున సర్వాజ్యాందోళనావిషయమున విద్యార్థులను, స్త్రీలను, పిల్లలను, ప్రజలను ఉన్ముఖులుగ గావించెను. గాంధిమహాత్ముని పద్ధతిని మీరక అసహాయోద్యమ